టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోలకు నెత్తిన జుట్టు తగ్గింది. అందులో కొందరు పర్మనెంట్ హెయిర్ సెటప్ పెట్టుకుంటే.. ఇంకొందరు హెయిర్ ఎటాచ్‌మెంట్స్ వాడుతున్నారు. కొందరేమో ఎప్పటికప్పుడు తీసి పక్కన పెట్టి మళ్లీ పెట్టుకునే విగ్గులు వాడుతున్నారు. అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన 90ల చివరి నుంచే విగ్గులు వాడుతున్నారు. కాకపోతే ఈ విషయంలో బాలయ్య అంతగా శ్రద్ధ పెట్టరు. రజినీకాంత్ లాంటి హీరోల మాదిరి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే విగ్గులు పెట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు.
సినిమాకో రకంగా విగ్గు మార్చి.. కొన్నిసార్లు అస్సలు సెట్ కాని విగ్గులు పెట్టుకుని అభిమానులతో సహా అందరినీ బెంబేలెత్తిస్తుంటారు. ముఖ్యంగా ‘రూలర్’ సినిమాలో ఒక రోల్ కోసం బాలయ్య పెట్టుకున్న విగ్ చూసి అభిమానులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.
ఐతే ఈ మధ్య బాలయ్యకు విగ్గు కష్టాలు తీరినట్లే ఉన్నాయి. తనకు పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే విగ్గులే వాడుతున్నారాయన. దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్యతో చేసే ప్రతి సినిమాలోనూ.. ఆయన్ని బెస్ట్ లుక్‌లో చూపించే ప్రయత్నం చేస్తుంటాడు. సింహా, లెజెండ్ సినిమాలు అప్పటికి బాలయ్యకు లుక్ పరంగా ది బెస్ట్ అనిపించాయి. ఇప్పుడు ‘అఖండ’ కోసం మరింత ఆకర్షణీయమైన లుక్‌లో కనిపిస్తున్నాడు నందమూరి హీరో.
తాజాగా ‘అఖండ’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా.. అందులో బాలయ్య లుక్స్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. పాత్రలో ఉన్న పవర్‌కు మంచి లుక్స్ కూడా తోడవడం వల్ల ‘అఖండ’గా అభిమానులు బాలయ్య తెగ నచ్చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తొలిసారిగా హోస్ట్‌గా మారి చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోలోనూ బాలయ్య లుక్స్‌తో చంపేస్తున్నాడు. ఆ షోను డైరెక్ట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ సైతం బాలయ్యను ది బెస్ట్‌గా చూపించే ప్రయత్నుం చేస్తున్నాడు. ఇప్పటికే లాంచింగ్ ఎపిసోడ్‌తో ఆకట్టుకున్న బాలయ్య.. తాజాగా నానితో చేయబోయే సెకండ్ ఎపిసోడ్ పోస్టర్లలో తన లుక్‌తో అభిమానులను కట్టిపడేస్తున్నాడు. బాలయ్యతో పని చేసే మిగతా దర్శకులు కూడా అందగాడైన బాలయ్యను ఇలాగే మంచి లుక్‌తో చూపించే ప్రయత్నం చేయాలి.
This post was last modified on November 8, 2021 6:58 pm
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి ప్రమోటర్స్ కావాలా? పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే.. వ్యూహాలు రచించడంతోపాటు.. ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు ప్రమోటర్ల…
కొత్త సినిమాలకు ముందు రోజు ప్రీమియర్లు వేయడం కొత్త కాకపోయినా ఇది రెండువైపులా పదునున్న కత్తిలా మారడంతో ఉపయోగాలు ఎన్ని…
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…