వరుస సినిమాలను అనౌన్స్ చేయడమే కాదు.. వాటిని చకచకా పూర్తి చేస్తూ యంగ్ హీరోలకి గట్టి పోటీనే ఇస్తున్నారు చిరంజీవి. ఆల్రెడీ ఆచార్య రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. గాడ్‌ఫాదర్‌ని చకచకా కంప్లీట్ చేస్తున్నారు. భోళాశంకర్‌ని లైన్‌లో పెట్టారు. ఇప్పుడు తన 154వ సినిమాని కూడా లాంఛనంగా మొదలు పెట్టేశారు.
బాబి డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడు ఓ మాస్ పోస్టర్‌ని విడుదల చేసి ఇంప్రెస్ చేసింది టీమ్. ఇప్పుడు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ మాస్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. ఇందులో చిరంజీవి స్టైల్ చూస్తుంటే మళ్లీ ఒకప్పటికి మెగాస్టార్‌ని చూసినట్టే ఉంది. పోస్టర్‌తోనే ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేయడం ఖాయమనిపిస్తోంది. అరాచకం ఆరంభం అని కోట్ చేశాడంటే బాబి ఈ సినిమాని ఏ రేంజ్‌లో తెరకెక్కించబోతున్నాడో ఊహించవచ్చు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ను సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ తను ప్రభాస్‌తో సాలార్ మూవీ చేస్తోంది. గోపీచంద్ మలినేని చిత్రంలో బాలయ్య సరసన కూడా కనిపించనుందని రీసెంట్‌గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు చిరంజీవితో కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వాల్తేరు వీర్రాజు అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
This post was last modified on November 8, 2021 10:54 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…