అక్కా అక్కా అంటూ యాంకర్లందరూ ప్రేమగా పిలుచుకుంటారు సుమ కనకాలని. తమని గైడ్ చేస్తుందని, సమస్యలు వస్తే పరిష్కారానికి సాయపడుతుందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఊరి సమస్యల్నే తీర్చడానికి రెడీ అవుతోంది సుమ. నిజంగా కాదులెండి.. వెండితెర మీద. సుమ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ప్రీ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఇప్పుడు టైటిల్ పోస్టర్‌ని, సుమ ఫస్ట్ లుక్‌ని రామ్ చరణ్ రిలీజ్ చేశాడు.
విజయ్ కుమార్ కలివరపు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. సంప్రదాయ చీరకట్టు, నుద్దుటన పావలా కాసంత బొట్టుతో అచ్చమైన పల్లెటూరి మహిళలా ఉంది సుమ. రోలు దగ్గర కూర్చుని ఏవో దంచుతోంది.
తేడా వస్తే ఎవరినైనా దంచుతాను అని ఈ విధంగా హింట్ ఇస్తున్నట్టుగా ఉంది. ఓ కొండ, దానిమీద గుడి, చెట్టుకు వేళ్లాడుతున్న మనుషులు, ఓ ప్రేమ జంట, ఒక కుటుంబం, మావోయిస్టులు.. ఇలా మోషన్ పోస్టర్‌లో ఎవరెవరో కనిపిస్తున్నారు. వీటన్నింటిని బట్టి, టైటిల్‌ని బట్టి సుమ ఆ ఊరి ప్రెసిడెంట్ అయ్యుండొచ్చేమో అనిపిస్తోంది.
బలగ ప్రకాష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అనూష్ కుమార్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కాస్త ప్రత్యేకంగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అవడానికి యాంకరే అయినా ఓ స్టార్ హీరోయిన్‌కి ఉండేంత ఫాలోయింగ్, నెట్‌వర్క్ ఉన్నాయి సుమకి. ఆ ధైర్యంతోనే చాలా యేళ్ల తర్వాత లీడ్ రోల్ చేయడానికి రెడీ అయ్యింది. మరి తొలి ఎంట్రీలో నటిగా విఫలమై యాంకర్‌గా సెటిలైన ఆమెకి, రీ ఎంట్రీ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.
This post was last modified on November 7, 2021 4:31 pm
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే... ఏదో…
దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు.…
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని…
'పద్మ శ్రీ' వంటి ప్రతిష్టాత్మక పౌర సన్మానాలు అందరికీ దక్కవు. దీనికి ఎంతో పెట్టిపుట్టి ఉండాలన్న చర్చ నుంచి నేడు…
ఓ సీఎం ప్రెస్ మీట్ అంటే.. లెక్కలేనన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్ సైట్లు, ప్రింట్ మీడియా… ఆయా సంస్థలకు…
2000 తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకడు. తొలి సినిమా ‘చెలి’ మొదలుకుని.. మూడేళ్ల…