Movie News

సునీల్ లుక్ ఓకే.. కానీ స్లాంగే?

‘పుష్ప’ సినిమా నుంచి సునీల్ లుక్ రిలీజ్ చేశారు ఆదివారం. ఇది చూసి షాకవ్వని వాళ్లు లేరు. సునీల్ ఇన్నేళ్ల కెరీర్లో ఇంత భయంకరంగా.. ఇంత ఇంటెన్స్ లుక్‌లో కనిపించింది ఎప్పుడూ లేదు. సుకుమార్ సినిమాలో సునీల్‌ను నెగెటివ్ రోల్‌లో చూడటమే ఆశ్చర్యం అంటే.. అతడి లుక్ ఇలా ఉండటం మరింత ఆశ్చర్యం.

ఈ సినిమాతో సునీల్ కెరీర్ ఒక కొత్త మలుపు తిరిగేలా కనిపిస్తోంది. కొన్నేళ్ల పాటు హీరో వేషాలకు పరిమితం కావడం, మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించడంతో సునీల్ కామెడీ ఇమేజ్ అంతా కొట్టుకుపోయింది. హీరో వేషాలు ఆపేసి తిరిగి కామెడీ చేయబోతే అది పండలేదు.

దీని వల్ల సునీల్ కెరీర్ రెంటికీ చెడ్డట్లు తయారైంది. ఇక అప్పుడే సునీల్ నెగెటివ్ రోల్స్ వైపు అడుగులేశాడు. ఐతే ‘డిస్కో రాజా’లో సునీల్ విలనీ చేస్తే అది కాస్తా కామెడీగా తయారైంది. సినిమాకు అది పెద్ద మైనస్‌గా తయారైంది కూడా. దీంతో సునీల్ ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడు.

ఐతే ‘కలర్ ఫొటో’లో మాత్రం సునీల్ విలన్‌గా సక్సెస్ అయ్యాడు. ఆ పాత్రను చక్కగా డిజైన్ చేసి.. సునీల్‌తో విలనీని పండించారు. దీంతో ఇక సునీల్ విలన్ రోల్స్ మరిన్ని చేయడానికి అవసరమైన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సమయంలోనే ‘పుష్ప’ సినిమాలో మంగళం శీను అనే పాత్ర చేసే అవకాశం దక్కింది.

సుక్కు సినిమాలో విలన్ రోల్స్ ఎంత ఇంటెన్స్‌గా, ఆసక్తికరంగా ఉంటాయో తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫాహద్ ఫాజిల్ అయినప్పటికీ పార్ట్-1లో అతడి స్క్రీన్ టైం తక్కువే. ధనంజయ, సునీల్‌ల పాత్రలకే నిడివి ఎక్కువ. సునీల్ పాత్ర సినిమాలో బాగానే హైలైట్ అవుతుందని.. ఒక రకంగా ఫస్ట్ పార్ట్‌లో ప్రేక్షకులకు ఎక్కువగా విలనీ చూసేది అతడి నుంచే అని సమాచారం. సునీల్ మేకోవర్ కూడా చాలా బాగుండటంతో ఈ పాత్రపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఐతే అంతా బాగుంది కానీ.. ఏ పాత్ర చేసినా, దాని నేపథ్యంతో సంబంధం లేకుండా తన గోదావరి స్లాంగ్‌తో డామినేట్ చేస్తుంటాడు సునీల్. తనకు తెలియకుండానే గోదారి యాస తీసుకొచ్చేస్తుంటాడు మాటల్లో. అంతగా అతడిలో స్లాంగ్ ఇమిడిపోయింది. అంతగా తన యాసకు అలవాటు పడిపోయిన సునీల్.. రాయలసీమ స్లాంగ్‌‌లో డైలాగులు చెప్పడమంటే అంత ఈజీ కాదు. ముఖ్యంగా ఈ సినిమా నడిచేది చిత్తూరు ప్రాంతంలో. మిగతా సీమ యాసతో పోలిస్తే చిత్తూరు స్లాంగ్ భిన్నంగా ఉంటుంది. దానికి అలవాటు పడటం చాలా చాలా కష్టమే. ఈ విషయంలో అథెంటిసిటీ మిస్ కాకూండా చూసుకోవడం కీలకం. మరి సుక్కు అండ్ టీం సునీల్‌ నుంచి సీమ యాస విషయంలో ఎంత జాగ్రత్త పడుతుందో చూడాలి.

This post was last modified on November 7, 2021 2:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

5 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

6 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

6 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

7 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

8 hours ago