Movie News

‘భీమ్లానాయక్’కి బెస్ట్ డేట్

మొత్తానికి సంక్రాంతి రేసు నుంచి మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ తప్పుకుంది. ఇది ఎప్పట్నుంచో అనుకుంటున్నదే. ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేశారు. ఇంతకుముందు ‘బాహులబి’ సినిమా కోసమని మహేష్ తన ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు. అప్పుడా నిర్ణయం ప్రశంసలందుకుంది. ‘బాహుబలి’ తెలుగు సినిమా గర్వించదగ్గన చిత్రం అవుతుందని అర్థం చేసుకుని.. ఇగోకు పోకుండా దానికి దారిచ్చి నెల రోజులు లేటుగా మహేష్ తన సినిమాను షెడ్యూల్ చేసుకున్నాడు. ఫలితంగా ‘బాహుబలి’ గొప్పగా ఆడింది. ‘శ్రీమంతుడు’కు కూడా మంచి ఫలితం వచ్చింది. ఇప్పుడు కూడా మహేష్ ఇదే రీతిలో ఆలోచించి ‘సర్కారు వారి పాట’ను ఏప్రిల్ 1కి వాయిదా వేసుకున్నాడు. ‘రాధేశ్యామ్’ పాన్ ఇండియా మూవీ కాబట్టి దాన్ని వాయిదా వేయలేరు. అందులోనూ ‘ఆర్ఆర్ఆర్’కు, దానికి వారం రోజుల గ్యాప్ కూడా ఉంది.

ఐతే సంక్రాంతి రేసులో నిలిచిన మరో చిత్రం ‘భీమ్లా నాయక్’ సంగతే తేలాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ వచ్చినా తగ్గేదే లే అన్నట్లుగా సంక్రాంతి రిలీజ్ గురించే మళ్లీ మళ్లీ నొక్కి వక్కాణిస్తున్నారు. కానీ ఈ మధ్యే రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ కొత్త ప్రోమో చూశాక దాంతోె పోటీ పడటం అంత మంచిది కాదని.. వసూళ్లపై కచ్చితంగా ప్రభావం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘భీమ్లా నాయక్’ నిర్మాతల్లో కూడా ఈ భయం ఉందని.. పవన్ కళ్యాణ్‌కు ఈ విషయంలో సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలొస్తున్నాయి. సంక్రాంతిని వదిలేసి.. మరీ లేటు చేయకుండా రిపబ్లిక్ డే వీకెండ్లో వస్తే ‘భీమ్లా నాయక్’కు అన్ని రకాలుగా మంచిదన్న అభిప్రాయం చిత్ర బృందంలో ఉందట. వేసవి వరకు సినిమాను ఆపలేమని.. పైగా సమ్మర్ సీజన్లోనూ విపరీతమైన పోటీ ఉందని.. సంక్రాంతి హడావుడి తగ్గాక రిపబ్లిక్ డే వీకెండ్లో సినిమాను వదిలితే.. సోలోగా బాక్సాఫీస్‌ను దున్నుకోవచ్చని.. ఫిబ్రవరి 4న ‘ఆచార్య’ వచ్చే వరకు మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారట. బహుశా ఈ డేట్‌కే ‘భీమ్లా నాయక్’ ఖరారయ్యే అవకాశాలున్నాయి.

This post was last modified on November 7, 2021 4:02 am

Share

Recent Posts

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

16 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

36 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…

3 hours ago

ఎల్లమ్మకు దొరికింది మంచి ఛాయిసే

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…

4 hours ago