యాంకర్ సుమ అప్పుడెప్పుడో 90వ దశకంలో ఏవో కొన్ని సినిమాలు, సీరియళ్లు చేసింది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే సినిమాలో వక్కంతం వంశీ పక్కన కథానాయికగా కూడా నటించింది. ఐతే ఆ తర్వాత ఆమె యాంకర్ అవతారమెత్తి ఆ రంగంలో తిరుగులేని స్థాయిని అందుకుంది. ఆపై ఆమె నటన గురించే ఆలోచించలేదు. ఐతే సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు సుమ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా కొన్ని రోజుల కిందటే వార్తలు రావడం తెలిసిందే. ఆమె రీఎంట్రీ గురించి తాజాగా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
సుమ ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయితి’ అనే సినిమా రాబోతోంది. దీని మోషన్ పోస్టర్ శనివారం రిలీజ్ చేశారు. ఇది గమనిస్తే ఇందులో సుమ మినహాయిస్తే దాదాపుగా అందరూ కొత్త వాళ్లే నటిస్తున్నారని.. ఒక బంగ్లా చుట్టూ తిరిగే కథ ఇదని.. సుమనే జయమ్మగా లీడ్ రోల్ చేయబోతోందని అర్థమవుతోంది. ఊర్లో జరిగే పంచాయితీల చుట్టూ కథ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ.. సుమకు యాంకర్‌గా ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు కొంత ప్రతిబంధకంగా మారే అవకాశముంది.
సుమ అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్. యాంకర్‌గా చేసినా.. ఏదైనా షోను హోస్ట్ చేసినా ఆమె నవ్వుల జల్లులు పూయిస్తుంటుంది. తన సెన్సాఫ్ హ్యూమర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆమె నుంచి సీరియస్‌నెస్ ఎప్పుడూ ఊహించలేం. చార్లీ చాప్లిన్‌ను చూడగానే నవ్వొచ్చినట్లు.. సుమను చూసినా అంతే. కామెడీ తప్ప ఇంకో రసం ఆమె నుంచి ఊహించలేం. ఐతే ఈ సినిమా పూర్తిగా కామెడీ చుట్టూ తిరిగేట్లయితే ఓకే కానీ.. ఆమె సెంటిమెంటో ఇంకోటో పండించాలని చూస్తే మాత్రం కష్టమే. ఈ కథ సీరియస్‌గా నడిచేట్లయితే సుమ మిస్ ఫిట్ అయి సినిమానే చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది కామెడీ సినిమా అయితేనే క్లిక్ అయ్యే ఛాన్సుంది.
This post was last modified on November 7, 2021 3:36 am
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…