ఒకప్పుడు తెలుగులో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా రిలీజవుతుంటే దానికి పోటీగా మన సినిమాలను రిలీజ్ చేయడానికి జంకేవారు. మన స్టార్ హీరోలతో సమానంగా రజినీకి క్రేజ్, మార్కెట్ ఉండేవి. ఆయన సినిమాలకు మంచి టాక్ వస్తే వసూళ్ల మోత మోగేది. టాక్ బాలేకున్నా ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండేది కాదు. బాషా, అరుణాచలం, నరసింహా, చంద్రముఖి, శివాజి, రోబో లాంటి సినిమాలు మామూలు వసూళ్లు రాబట్టలేదు. ‘కబాలి’ టైంకి రజినీకి తెలుగులో క్రేజ్ పీక్స్‌కు చేరి.. ఆ చిత్రానికి తొలి రోజు రూ.12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ‘2.0’కు ఇంతకంటే ఎక్కువ ఓపెనింగ్సే వచ్చాయి కానీ.. అది వేరే లీగ్ సినిమా. ఐతే అప్పుడు ఆ స్థాయిలో ఉన్న రజినీ మార్కెట్.. ఇప్పుడు ఎంత దిగజారిపోయిందో చెప్పడానికి ఆయన కొత్త చిత్రం ‘పెద్దన్న’కు వచ్చిన ఓపెనింగ్సే నిదర్శనం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం కేవలం 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.
నైజాంలో అయితే మరీ కనీసంగా రూ.42 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. రజినీ చివరి సినిమా ‘దర్బార్’కు తెలంగాణ వరకే రూ.2.3 కోట్ల వసూళ్లు రావడం గమనార్హం. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కూడా అందులో మూడో వంతు వసూళ్లే వచ్చాయి. ‘కబాలి’ దగ్గర్నుంచి తన స్థాయికి తగని సినిమాలు చేసి ఇంతకుముందున్న భారీ మార్కెట్‌ను రజినీ చేజేతులా దెబ్బ తీసుకున్నాడు. ‘పెద్దన్న’ విషయంలో మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎగ్జైట్మెంట్ లేదని.. రజినీ పట్ల వారికి ముందున్న ఆసక్తి మొత్తం పోయిందని.. ఆయన క్రేజ్, మార్కెట్ దారుణంగా దెబ్బ తినేశాయని స్పష్టమవుతోంది. సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు మరీ నామమాత్రంగానే వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీకెండ్ అవ్వగానే సినిమా కథ ముగిసినట్లే అనుకోవచ్చు. ‘పెద్దన్న’ చూశాక అసలు రజినీ సినిమాలు మానేస్తే బెటర్ అనే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి వ్యక్తమవుతుండటం గమనార్హం.
This post was last modified on November 7, 2021 3:12 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…