సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు మామూలు ఆకలితో లేరు కొన్నేళ్ల నుంచి. ఆ ఆకలి ఈ దీపావళికైనా తీరుతుందని ఆశించారు. కానీ అన్నాత్తె/పెద్దన్న సైతం వాళ్లను తీవ్ర నిరాశకే గురి చేసింది. ఈ మధ్య కాలంలో అనే కాదు.. మొత్తంగా రజినీ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా ‘పెద్దన్న’ను విశ్లేషకులు తీర్మానిస్తుండటం గమనార్హం. ఫ్యామిలీ సెంటిమెంట్ మిక్స్ చేసి మాస్ చిత్రాలను జనరంజకంగా తీయడంలో సిద్ధహస్తుడిగా పేరున్న శివ దర్శకత్వంలో రజినీ సినిమా.. అందులోనూ శివ ‘విశ్వాసం’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తీసిన చిత్రం అనేసరికి ఈసారి సూపర్ స్టార్ బ్లాక్‌బస్టర్ కొట్టడం ఖాయమనే అనుకున్నారు.
కానీ ఈ సినిమా రజినీ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాస్ ప్రేక్షకులు.. ఫ్యాన్స్.. ఇలా ఎవ్వరికీ ఈ సినిమా రుచించడం లేదు. ఈ సినిమా గురించి నిన్న రాత్రి ఎంతో హడావుడి చేసిన అభిమానులు.. ఈ రోజు ఉదయానికి చల్లబడిపోయారు. ఫ్యాన్స్ షోల నుంచే సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక ఉదయం మామూలు ప్రేక్షకుల నుంచి వస్తున్న టాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 30-40 ఏళ్ల కిందటి కథా కథనాలతో ఓవర్ డోస్ సెంటిమెంట్.. మితిమీరిన యాక్షన్‌తో సినిమాను నింపేసిన శివ.. కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోయాడు. ఇలాంటి సినిమా రజినీ ఎలా చేశాడో.. సన్ పిక్చర్స్ లాంటి పేరున్న నిర్మాణ సంస్థ ఇంత పేలవంగా సినిమా తీస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుందో అర్థం కావడం లేదు. చివరగా ‘రోబో’తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రజినీ.. తర్వాత ఒక్క సినిమాతోనూ మెప్పించలేకపోయాడు.
ఐతే కబాలి, కాలా, 2.0, పేట, దర్బార్ లాంటి సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయన్న మాటే కానీ.. మరీ తీసి పడేసే సినిమాలైతే కావు. కానీ ‘పెద్దన్న’ మాత్రం వాటి కోవలో చేర్చలేనిది. రజినీ కెరీర్లోనే అత్యంత చెత్త సినిమాల్లో ఒకటి అనడంలో సందేహం లేదు. వయసు, ఆరోగ్యం సహకరించని సమయంలో ఇంతింత కష్టపడి, రిస్క్ చేసి ఇలాంటి పనికి రాని సినిమాలు చేసి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేయడం కన్నా రజినీ సినిమాలే మానేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవడం మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతుుండటం గమనార్హం.
This post was last modified on November 5, 2021 8:24 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…