పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి శరవేగంగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఐతే పునరాగమనం తర్వాత ఆయన లైన్లో పెట్టిన సినిమాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ఏదంటే మాత్రం ‘భీమ్లా నాయక్’ అనే చెప్పాలి. మలయాళ బ్లాక్‌బస్టర్ ‘అయ్యప్పనుం కోషీయుం’కు రీమేక్ అయిన ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లినపుడు పెద్దగా ఆసక్తి కలిగించలేదు. రీమేక్ అనగానే బేసిగ్గా ఇప్పటి జనాలకు అంత ఇంట్రెస్ట్ కలగట్లేదు. అన్ని భాషల చిత్రాలనూ ఓటీటీలో అందరూ ముందే చూసేస్తుండటమే అందుక్కారణం. ఐతే ‘భీమ్లా నాయక్’ మొదలైనప్పటితో పోలిస్తే.. తర్వాత ఒక్కో ప్రోమో రిలీజయ్యాక దాని పట్ల ప్రేక్షకుల దృష్టికోణమే మారిపోయింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మాస్ స్టయిల్లో, మరింత ఎంటర్టైనింగ్‌గా ఈ సినిమా తీసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను సినిమా కోసం బాగానే వాడుకున్నట్లు తోస్తోంది.
ఇప్పటిదాకా ప్రతి ప్రోమోలోనూ పవన్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాడు. దీపావళి ముంగిట రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ స్పెషల్ ప్రోమో సైతం పేలిపోయే రేంజిలోనే ఉంది.
ఐతే దీంతో పాటుగా రిలీజ్ చేస్తున్న పోస్టర్ల విషయంలో మాత్రం కాస్త అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ బహిరంగ ప్రదేశంలో మందు బాటిల్ పెట్టుకుని విందుకు రెడీ అయినట్లుగా ఒక పోస్టర్.. అలాగే మందు బాటిల్ పట్టుకుని నడుచుకొస్తున్నట్లుగా ఒక పోస్టర్ వదిలారు. పవన్ మామూలు హీరోనే అయితే ఇలాంటి పోస్టర్లు రిలీజ్ చేయడంలో అభ్యంతరమేమీ లేదు. కానీ ఆయన ఒక రాజకీయ నాయకుడు. అందులోనూ కొత్త తరహా రాజకీయాలు చేస్తానని ఆదర్శాలు మాట్లాడే నాయకుడు. అలాంటి నాయకుడు సినిమా కోసమైనా సరే.. ఇలాంటి అవతారంలో కనిపిస్తే చూసే జనాలకు ఇబ్బందే. ఇది సమాజానికి సరైన సంకేతాలను ఇవ్వదు. తెరమీద మందు కొట్టే సీనే చేయకూడదు.. పూర్తిగా ఉత్తముడి పాత్రలే చేయాలి అని చెప్పలేం కానీ.. ఇలాంటి పోస్టర్ల ద్వారా చెడు సంకేతాలు వెళ్తాయని.. మామూలు హీరోలే ఇలాంటివి చేయకుంటే మంచిదని.. అందులోనూ బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పవన్ అసలే ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on November 5, 2021 8:14 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…