2021 డిసెంబర్ లో చాలా సినిమాలు విడుదల కాబోతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాటు బాలకృష్ణ ‘అఖండ’ లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాలతో పాటు రవితేజ, నాని సినిమాలు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.
నానికి పోటీగా తన సినిమాను విడుదల చేయాలని రవితేజ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నాని ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.
ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమాతో పాటు పోటీకి దిగుతున్నారు రవితేజ. ఆయన నటించిన ‘ఖిలాడి’ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయాలనుకుంటున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా షురూ చేశారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పెద్ద సినిమాలు రేసులో ఉన్నాయి.
‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’, ‘ఎఫ్3’ ఇలా చాలా సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. ఆ తరువాత వేసవి సినిమాలు క్యూ కడతాయి. అందుకే తన సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని రవితేజ భావిస్తున్నారు. అదే టైంకి నాని సినిమా కూడా వస్తుండడంతో బాక్సాఫీస్ వార్ తప్పదనిపిస్తోంది. రమేష్ వర్మ డైరెక్ట్ చేసిన ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
This post was last modified on November 3, 2021 3:57 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…