సినిమా అనగానే ఎంతసేపూ ‘కమర్షియాలిటీ’ గురించే ఆలోచిస్తారు ఫిలిం మేకర్స్. సినిమా అనేది ఒక వ్యాపారం కాబట్టి అలా ఆలోచించడంలో తప్పు కూడా లేదు. ఐతే అందరూ అలాగే ఆలోచించి కమర్షియల్ హంగులతోనే సినిమాలు తీసుకుంటూ పోతే.. ఇక సమాజాన్ని కదిలించే.. ఆలోచన రేకెత్తించే.. సమస్యల్ని ఎత్తి చూపే సినిమాలు చేసేదెవరు? అందుకే కొందరు సామాజిక బాధ్యతతో సినిమాలు తీసే ప్రయత్నం చేస్తుంటారు.
ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడూ ఇలాంటి మంచి ప్రయత్నాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరి మీదా ఉంటుంది. ఈ విషయంలో తమిళ స్టార్ హీరో సూర్య మిగతా వాళ్లకు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాడు. ఎప్పటికప్పుడు విభిన్నమైన కథల కోసం తపించే అతను.. సామాజిక బాధ్యతతోనూ కొన్ని సినిమాలు చేస్తుంటాడు. ముఖ్యంగా 2డీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను పెట్టాక అందులో నిర్మిస్తున్న ప్రతి చిత్రం సొసైటీకి ఏదో ఒక మంచి సందేశం ఇచ్చేది.. ఏదైనా బర్నింగ్ ఇష్యూను చర్చించేదిగానే ఉంటోంది.
తాజాగా సూర్య తనే లీడ్ రోల్ చేస్తూ ‘జై భీమ్’ అనే సినిమా చేశాడు. జ్ఞానవేల్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక అరుదైన సినిమా అనడంలో సందేహం లేదు. ఇంతకుముందు వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘విసారణై’ సినిమాను కొంతమేర గుర్తు చేసినా దీని ప్రత్యేకత దీనిదే. ఒక గిరిజన తెగకు చెందిన యువకుడిని పోలీసులు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి నేరం ఒప్పించేందుకు చిత్ర హింసలు పెట్టి అతడి ప్రాణాలను హరిస్తే.. నిస్సహాయురాలైన అతడి భార్యకు అండగా నిలిచి ఈ కేసులో ఆమెకు న్యాయం జరిగేలా చేసిన ఓ లాయర్ కథ ఇది. 90వ దశకంలో తమిళనాట జరిగిన నిజమైన కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ కథాంశాన్ని బట్టి ఇంత సీరియస్, ఇష్యూ బేస్డ్ మూవీ సగటు ప్రేక్షకులకు ఏం రుచిస్తుందిలే అనుకోవడానికి లేదు. కథాంశం ఎంత హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుందో.. కోర్ట్ రూం డ్రామా అంత ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా, హృద్యంగా సాగుతుంది. ఆద్యంతం ఎంగేజ్ చేయడమే కాక ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి సినిమాకు నిర్మాతగా అండగా నిలవడమే కాక.. అద్భుతమైన పెర్ఫామెన్స్‌తో సినిమాకు ప్రాణం పోసిన సూర్యను ఎంత పొగిడినా తక్కువే. సూర్య మీద ఇప్పటిదాకా ఉన్న అభిమానం, గౌరవాన్ని ఇంకొన్ని రెట్లు పెంచే సినిమా ఇదనడంలో సందేహం లేదు.
This post was last modified on November 2, 2021 4:14 pm
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…