కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన పునీత్ రాజ్‌కుమార్ చనిపోయి అప్పుడే మూడు రోజులు దాటిపోయింది. అతను చనిపోయింది శుక్రవారం అయినా.. అశేషమైన అభిమానులకు కడసారి చూపు చూసుకునే అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రెండు రోజుల పాటు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో అతడి పార్థివ దేహాన్ని ఉంచారు. లక్షల మంది పునీత్‌ను చివరి చూపు చూసుకున్నాక ఆదివారం అతడి అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఐతే పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు గుండెపోటుకు గురి కావడం.. ఆత్మహత్యలకు పాల్పడటం లాంటివి జరుగుతుండటం బాధాకరం. ఈ నేపథ్యంలోనే తమ్ముడి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ.. శివరాజ్ కుమార్ అభిమానులనుద్దేశించి మాట్లాడాడు. తమ్ముడి మరణాన్ని తట్టుకోవడం తన వల్ల కూడా కావట్లేదని.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, నమ్మలేకపోతున్నానని అన్న శివరాజ్ కుమార్.. వాస్తవాన్ని అంగీకరించి జీవితంలో ముందుకు వెళ్లడం అవసరమని అన్నాడు.
అభిమానులకు కుటుంబాలున్నాయని, వాళ్లను నమ్ముకుని ఎంతోమంది ఉంటారని.. కాబట్టి ఈ సమయంలో నిబ్బరంతో ఉండాలని శివరాజ్ సూచించాడు. పునీత్ తనకంటే 13 ఏళ్లు చిన్నవాడని.. అతను తన చేతుల్లో పెరిగాడని.. అందుకే తననెప్పుడూ తమ్ముడిలా చూడలేదని, కొడుకులాగే చూసేవాడినని.. ఇప్పుడు అతడి మరణం తీవ్ర వేదన కలిగిస్తోందని.. తమ కుటుంబానికి ఇది తీరని లోటని శివరాజ్ వ్యాఖ్యానించాడు.
తమ్ముడి మరణంతో శివరాజ్ ఎంత వేదనకు గురయ్యాడో చెప్పడానికి పునీత్ పార్థివ దేహం పక్కన చిన్నపిల్లాడిలా కూర్చుని ఏడ్చిన వీడియోలు నిదర్శనం. అంత బాధలోనూ అభిమానుల పట్ల బాధ్యతతో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అభినందనీయం.
This post was last modified on November 2, 2021 7:24 am
పండక్కు రిలీజై హిట్టు కొట్టిన రెండు సినిమాల్లో చైల్డ్ ఎలిమెంట్ కీలక పాత్ర పోషించడాన్ని కొట్టిపారేయలేం. ముందుగా డాకు మహారాజ్…
తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు హైదరాబాద్‌లో ఎంత పెద్ద స్థాయిలో నిలబడుతోందో తెలిసిందే. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీల్లో…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా…
గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు అతి…
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్‌లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…