Movie News

న‌లుగురికి చూపునిచ్చిన పునీత్‌

కొంత‌మంది మ‌ర‌ణించిన త‌ర్వాతే వాళ్లెంత మంచి వార‌నే విష‌యం ప్రపంచానికి తెలుస్తుంటుంది. క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. అత‌ను ఒక్క‌డే 26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు న‌డుపుతున్నాడ‌ని.. 1800 మంది పిల్లల్ని దత్తత తీసుకుని వారి బాధ్య‌త‌లు చూస్తున్నాడ‌ని.. మైసూర్లో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థ‌ను న‌డుపుతున్నాడ‌ని తెలిసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారిప్పుడు.

ఈ మెసేజ్ అత‌ను మ‌ర‌ణించిన రోజు నుంచి సోష‌ల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది. అదే స‌మ‌యంలో త‌న మ‌ర‌ణానంత‌రం క‌ళ్లు దాన‌మివ్వాల‌ని ముందే డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌డంతో.. చ‌నిపోయిన కొన్ని గంట‌ల్లోనే పునీత్ క‌ళ్ల‌ను తీసి ఒక పెట్టెలో తీసుకెళ్తున్న దృశ్యం కూడా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అయింది.

పునీల్ క‌ళ్లు ఏకంగా న‌లుగురికి చూపునివ్వ‌డం విశేషం. అత‌డి క‌ళ్ల‌ను ఈ విష‌యాన్ని బెంగ‌ళూరులోని నారాయ‌ణ నేత్రాల‌య ఆసుప‌త్రి వైద్యులు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ వెల్లడించ‌డం గ‌మ‌నార్హం. సాధారణంగా చ‌నిపోయిన వ్య‌క్తుల నుంచి సేక‌రించిన‌ కళ్ళను ఇతరులకి ట్రాన్స్‌‌ప్లాంట్ చేస్తారు. ఒక వ్యక్తి కళ్ళతో ఇద్దరికీ మాత్రమే చూపు దక్కుతుంది. కానీ పునీత్ కళ్ళలోని కార్నియాలను వేరు చేసి అంధులైన నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అవి విజ‌య‌వంత‌మై ఆ న‌లుగురికీ చూపు వ‌చ్చింది.

అధునాతన సాంకేతికతతో ఈ మార్పిడి చేశామని నారాయణ నేత్రాలయ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భుజంగ్ శెట్టి వెల్ల‌డించారు. పునీత్ క‌ళ్ల‌తో చూపు దక్కించుకున్నవారిలో ఒక మహిళ మరియు ముగ్గురు పురుషులు ఉన్నారు. వీళ్లంద‌రూ కర్ణాటకకి చెందినవారే. పునీత్ తండ్రి రాజ్‌కుమార్, త‌ల్లి పార్వ‌త‌మ్మ కూడా మ‌ర‌ణానంత‌రం వారి క‌ళ్ల‌ను దానం చేశారు. వారిని పునీత్ అనుస‌రించి న‌లుగురు అంధుల జీవితాల్లో వెలుగులు నింపాడు.

This post was last modified on November 2, 2021 7:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago