ఏ ముహూర్తాన ‘ఆర్ఆర్ఆర్’ మొదలైందో కానీ.. ఇక అప్పట్నుంచి ఈ సినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోల్లో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.. ఎవరికెక్కువ స్క్రీన్ టైం ఉంటుంది.. ఎవరికి జక్కన్న ఎక్కువ ఎలివేషన్ ఇచ్చి ఉంటాడు.. యాక్షన్‌లో ఎవరిది పైచేయి.. లుక్స్ పరంగా ఎవరెక్కువ ఆకట్టుకుంటారు.. ఇద్దరి ప్రేమకథల్లో ఏది బాగా పండుతుంది.. వీరి పక్కన నటించే కథానాయికల్లో ఎవరు బాగా హైలైట్ అవుతారు.. ఎవరి జోడీ బాగుంటుంది అనే చర్చలు ఎడతెగని విధంగా నడుస్తూనే ఉన్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ టీజర్ దగ్గర్నుంచి ఇద్దరినీ పోలుస్తూ సోషల్ మీడియాలో వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆ తర్వాత రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల పాత్రలకు సంబంధించి వేర్వేరుగా టీజర్లు రిలీజయ్యాక ఈ చర్చ మరింత ఊపందుకుంది. సినిమా టైటిలో లోగోలో ఎవరి ఫొటో ముందుంది, ఎవరు వెనుకున్నారనేదాన్ని బట్టి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరిగాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ సినిమాకు సంబంధించి ఏ విశేషం బయటికి వచ్చినా.. అందులో ఇద్దరు హీరోల్లో ఎవరికెన్ని షాట్లున్నాయి, ఎవరు ముందు కనిపించారు.. ఎవరెక్కువ హైలైట్ అయ్యారు అని లెక్కగట్టి.. మావోడు గొప్పంటే మావోడు గొప్ప అని తారక్, చరణ్ ఫ్యాన్స్ కొట్టేసుకుంటుండటం గమనార్హం. ఆ ఇద్దరు హీరోలు మంచి స్నేహితులు.. ఏ లెక్కలు వేసుకోకుండా కలిసి.. రాజమౌళికి సరెండ్ అయి సినిమా చేస్తూ.. ఈ సినిమా ప్రయాణంలో మరింత దగ్గరైన వాళ్లిద్దరినీ అర్థం చేసుకోకుండా అభిమానులిలా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌కు దిగడం విడ్డూరం. ఐతే రాజమౌళికి ఇద్దరు హీరోల్లో ఎవరూ తక్కువ కాదు. ఎక్కువ కాదు.
వ్యక్తిగతంగా ఎవరెంత దగ్గరన్నది పక్కన పెడితే.. ఎవరినీ సినిమాలో తగ్గించాలని చూసే అవకాశమే లేదు. మాస్ పల్స్, ముఖ్యంగా అభిమానుల ఆకాంక్షలు ఎలాంటివో తెలిసిన జక్కన్న కచ్చితంగా ఇద్దరినీ సమానంగానే ఎలివేట్ చేసి ఉంటాడు. తెలిసో తెలియకో, ఇంకేవైనా పరిమితుల వల్లే సినిమా చూస్తున్నపుడు తక్కెడ కొంచెం అటు ఇటు తూగుతుందేమో.
ఒకరు లుక్స్‌లో ఎలివేట్ అయితే.. ఇంకొకరు పాత్ర పరంగా హైలైట్ కావచ్చు. ఒకరు యాక్షన్ సన్నివేశాల్లో పైచేయి సాధిస్తే.. ఇంకొకరు ఎమోషన్లతో ఆధిపత్యం చలాయించొచ్చు. తెలుగు సినిమా గర్వించే మరో గొప్ప చిత్రాన్ని జక్కన్న అందిస్తున్నాడు.. మన హీరోలిద్దరికీ ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కబోతోందని సంతోషించకుండా ఈ ఎడతెగని ఫ్యాన్ వార్స్ ఏంటో అర్థం కావట్లేదు.
This post was last modified on November 2, 2021 5:50 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…