15 ఏళ్ల కిందట చిన్న స్థాయి కథానాయికగా కెరీర్‌ను ఆరంభించి.. చాలా త్వరగానే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన భామ ప్రియమణి. తెలుగు పెళ్లైన కొత్తలో లాంటి మీడియం రేంజ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత ఎన్టీఆర్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ లాంటి పెద్ద హీరోలతో సినిమాలు చేసిందామె. ఒక ఐదారేళ్ల పాటు ఆమె హవా సాగింది. కానీ ఉన్నట్లుండి ఆమె కనుమరుగైపోయింది. ఒక దశలో పూర్తిగా సినిమాలకు దూరమైంది.
కానీ ఇప్పుడు ప్రియమణి స్పెషల్ క్యారెక్టర్లతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను భలేగా ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో సత్తా చాటిన ప్రియమణి.. ఇప్పుడు తెలుగులో రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చేస్తోంది. అందులో ఒకటి ‘నారప్ప’ అన్న సంగతి తెలిసిందే. ఇంకోటి ‘విరాటపర్వం’ అని తాజాగా వెల్లడైంది.
గురువారం ప్రియమణి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘విరాటపర్వం’ నుంచి ప్రియమణి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇందులో భారతక్క అనే నక్సలైట్ పాత్ర చేస్తోందామె. ఈ చిత్రంలో ప్రియమణి నటిస్తున్న సంగతే ఎవరికీ తెలియదు. ఈ రోజే ఈ విషయాన్ని రివీల్ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా చాలా ఇంటెన్స్‌గా ఉండబోతోందని మొదట్నుంచి సంకేతాలు అందుతూనే ఉన్నాయి. రానా, సాయిపల్లవి లాంటి మంచి పెర్ఫామర్లకు దీటుగా ప్రియమణి పాత్ర కూడా ఉంటుందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రియమణి నటిస్తున్న ‘నారప్ప’ నుంచి కూడా ఆమె ఫస్ట్ లుక్‌ను ఈ రోజే లాంచ్ చేశారు.
అది కూడా ప్రియమణి ప్రత్యేకతను చాటేలాగే ఉంది. దీని మాతృక ‘అసురన్’లో మంజు వారియర్ చేసిన పాత్రను ప్రియమణి చేస్తోంది. ఆ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్లకు కెరీర్లో గ్యాప్ వచ్చి, కొంచెం వయసు పెరిగాక రీఎంట్రీ ఇస్తే చాలా వరకు మొక్కుబడి పాత్రలే చేస్తుంటారు కానీ.. ప్రియమణి మాత్రం రీఎంట్రీకి బలమైన పాత్రలే ఎంచుకుందన్నది స్పష్టం. ఇలా అందరికీ జరగదు. మొత్తానికి చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రియమణి గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా మాట్లాడుకునేలా ఉన్నాయి ఈ రోజు రిలీజ్ చేసిన ఆమె లుక్స్.
This post was last modified on June 4, 2020 2:47 pm
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…