నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ఇటీవలే ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాను పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే ‘దసరా’ అనే మరో సినిమా అనౌన్స్ చేశారు నాని.
ఈ సినిమాలో తొలిసారి నానిని ఊర మాస్ గెటప్ లో చూపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ముందుగా ఈ సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.
గతంలో నాని-కీర్తి సురేష్ కలిసి ‘నేను లోకల్’ అనే సినిమాలో నటించారు. అందులో వీరిద్దరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ కు రెడీ అవుతోంది. తెలంగాణలో ఉన్న సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం మరో స్టార్ హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. కథ ప్రకారం.. సినిమాలో కీలకపాత్ర ఉందట. దానికోసం సమంతను తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఆమెని సంప్రదించి కథ వినిపించినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. నాని-కీర్తి సురేష్ లతో పాటు సమంత పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఆమె గనుక ఒప్పుకుంటే సినిమా క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
గతంలో నానితో కలిసి ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ వంటి సినిమాల్లో నటించింది సమంత. అలానే కీర్తి సురేష్ తో కలిసి ‘మహానటి’లో కనిపించింది. ఇప్పుడు వీరు ముగ్గురూ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పండగే. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on October 31, 2021 11:39 pm
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…