టాలీవుడ్లో దర్శకేంద్రరావు వైభవం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలుకుని.. ఆ తర్వాత రెండు తరాల హీరోలు ఆయనతో సినిమా చేయడానికి తపించిన వాళ్లే. ఆయనతో ఒక్క సినిమా చేసి ఇమేజ్‌ను మార్చుకున్న వాళ్లు ఎంతోమంది. వెంకటేష్, మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లు ఆయన చేతుల మీదుగా పరిచయమై బడా స్టార్లు అయిన వాళ్లే. అలాంటి దర్శకుడు తన కొడుకు ప్రకాష్‌ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు. నీతో అనే సినిమాతో అతణ్ని లాంచ్ చేసి చేదు అనుభవం ఎదుర్కొన్నాడు రాఘవేంద్రరావు. ఆ తర్వాత మార్నింగ్ రాగా అనే సినిమా చేసి.. దర్శకత్వం వైపు వెళ్లిపోయాడు ప్రకాష్. మరో లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు సైతం తన కొడుకు అరుణ్ కుమార్‌కు హీరోగా కెరీర్ ఇవ్వలేకపోయాడు. సొంతంగా సినిమాలు తీశాడు. వేరేవాళ్ల చేతికి అప్పగించాడు. అయినా ఫలితం లేకపోయింది.
ఇక వర్తమానంలోకి వస్తే ఎంతోమంది హీరోలకు భారీ విజయాలందించిన పూరి జగన్నాథ్ సైతం తన కొడుకు ఆకాశ్‌ను హీరోగా నిలబెట్టే విషయంలో తడబడుతున్నాడు. టీనేజీలో అతను ప్రధాన పాత్ర పోషించిన ఆంధ్రాపోరి వచ్చింది వెళ్లింది కూడా తెలియదు. ఇక పూరీనే స్వయంగా మెహబూబా మూవీతో కొడుకును రీలాంచ్ చేశాడు. ఆ చిత్రం చేదు అనుభవాన్నే మిగిల్చింది.
ఇప్పుడు రొమాంటిక్‌తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఆకాశ్. కానీ ఈ సినిమాలో కూడా మెరుపులేమీ లేవు. హీరో హీరోయిన్ల రొమాన్స్ తప్ప సినిమాకు ఏ ఆకర్షణా లేదు. నిజానికి ఈ సినిమా పట్ల యూత్‌లో ఆసక్తి రేగడానికి హీరోయిన్ కేతిక శర్మ బోల్డ్ లుక్స్, ప్రోమోలే కారణం. అందువల్లే ఈ చిత్రానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ కూడా వచ్చాయి.
ఈ చిత్రం వల్ల ఆకాశ్‌కైతే పెద్దగా ఉపయోగం లేదు. పూరి అరగతీసిన యాక్షన్, లవ్ అంశాలనే ఇందులోనూ దట్టించాడు. అవి ప్రేక్షకులకు రుచించడం లేదు. ఆకాశ్ టాలెంటెడ్ అనిపించినా.. వీక్ స్క్రిప్ట్ వల్ల అతను పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. పూరి ఈ సినిమాను డైరెక్ట్ చేయకపోయినా.. స్క్రిప్టు ఆయనదే కావడంతో తన సినిమాలాగే అనిపించింది. తన టైం అయిపోయిందని పూరి గుర్తించి కొడుకు శ్రేయస్సు దృష్ట్యా ఇప్పటి ట్రెండుకు తగ్గ దర్శకులకు ఆకాశ్‌ను అప్పగించి సైడైపోవడం బెటర్ అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయిప్పుడు. కొడుకును హీరోగా నిలబెట్టాలన్న ఆశ ఉండొచ్చు కానీ.. ఆయన జోక్యమే అతడికి శాపం అవుతున్నపుడు సైలెంటుగా ఉండటమే బెటర్ కదా.
This post was last modified on October 30, 2021 10:46 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…