ఒక్క సినిమాతో అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన డైరెక్ట్ చేసిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకరకంగా ట్రెండ్ మార్చిందనే చెప్పాలి. ఈ సినిమాను మిగిలిన భాషల్లో కూడా రీమేక్ చేయగా.. మంచి విజయాన్ని అందుకుంది. హిందీ వెర్షన్ ను సందీప్ రెడ్డి స్వయంగా డైరెక్ట్ చేశాడు. ‘కబీర్ సింగ్’ పేరుతో విడుదలైన ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసేశాడు సందీప్ రెడ్డి.
ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలానే ప్రభాస్ హీరోగా ఓ సినిమాను అనౌన్స్ చేశాడు. అదే ‘స్పిరిట్’. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను నాలుగు వందల కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తారని టాక్. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ రూ.150 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం. హీరోకి అంతిస్తుండడంతో.. డైరెక్టర్ కి కూడా బాగానే ముట్టజెప్పి ఉంటారనే మాటలు వస్తున్నాయి.
దీనిపై ఆరా తీయగా.. సందీప్ కి రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారట. అది ఎంత శాతమో తెలుసా..? యాభై శాతం. లాభాల్లో యాభై శాతం వాటా అంటే మామూలు విషయం కాదు. అది కూడా ప్రభాస్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. ముందుగా ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’ సినిమాలను పూర్తి చేయాలి. వాటితో పాటు నాగశ్విన్ ‘ప్రాజెక్ట్ K’ కూడా ఉంది. వీటన్నింటిమధ్య ‘స్పిరిట్’ను ఎప్పుడు మొదలుపెడతారో..!
This post was last modified on October 30, 2021 10:42 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…