Movie News

ఓటీటీలకి గుడ్‌ బై

ఎటువంటి పాత్రనైనా అవలీలగా, అద్భుతంగా పోషించి వెర్సటైల్‌ యాక్టర్‌‌గా పేరు గడించిన నవాజుద్దీన్ సిద్దిఖీ.. ఓటీటీల్లోనూ తన హవా కొనసాగించాడు. థియేటర్స్‌కి ప్రత్యామ్నాయంగా వచ్చిన డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌కి ఆయన మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయ్యాడు. అయితే ఇప్పుడో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై డిజిటల్‌ ప్రాజెక్ట్స్ చేయనని తెగేసి చెప్పాడు.

ఫొటోగ్రాఫ్, రాత్‌ అకేలీ హై, ఘూమ్‌కేతు, సీరియస్ మెన్ లాంటి చిత్రాలతో పాటు ‘శాక్రెడ్ గేమ్స్’ లాంటి వెబ్‌ సిరీసులతోనూ ఓటీటీల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు సిద్దిఖీ. అయితే అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంత సీన్ లేదు అంటున్నాడు. ఓటీటీ కంటెంట్‌లో వచ్చిన మార్పు తనని చాలా డిస్టర్బ్ చేసిందని, అందుకే ఇక డిజిటల్ ప్రపంచానికి గుడ్ బై చెప్పేస్తున్నానని అంటున్నాడు.

‘శాక్రెడ్ గేమ్స్ చేస్తున్నప్పుడు చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. మంచి కంటెంట్‌కి ఓటీటీలు స్థానం కల్పిస్తున్నాయని, కొత్తవారికి అవకాశాలు ఇస్తున్నాయని ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న కంటెంట్ చూస్తుంటే చిరాకేస్తోంది. చెత్త కంటెంట్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ని నింపేస్తున్నారు. పైగా వాటికి సీక్వెల్స్ కూడా తీస్తున్నారు. ఇలాంటి వాటిలో నటించి కొందరు స్టార్స్‌ అయిపోతున్నారు. ఇక ఇక్కడ నాలాంటి వాడికి పనేముంది! దీనికి తోడు ఇదో దందాలా తయారైంది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎంటరై వరుస ప్రాజెక్టులు చేస్తామంటూ భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. దాంతో క్వాంటిటీ క్వాలిటీని చంపేస్తోంది. అందుకే నేనిక ఓటీటీల కోసం పని చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను’ అని చెప్పాడు సిద్దిఖీ.

ఆయన అన్నదాంట్లో తప్పేమీ లేదేమో. ఓటీటీల్లో వస్తున్న కంటెంట్ క్వాలిటీ తగ్గిపోయిందంటూ కొద్ది రోజులుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా బోల్డ్ కంటెంట్‌ కూడా ఎక్కువ కావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ చూడలేని పరిస్థితి వచ్చిందని కొందరు ఆరోపిస్తున్నారు. నవాజ్‌ లాంటి అద్భుతమైన నటుడికి ఈ పరిస్థితి నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. గుంపులో గోవిందలా ఉండటం ఇష్టం లేక పక్కకి తప్పుకోవడంలో తప్పూ లేదు.

This post was last modified on October 29, 2021 3:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

6 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

9 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

9 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

10 hours ago