సరైన సినిమా పడితే.. ఒక హీరో అయినా.. హీరోయిన్ అయినా రాత్రికి రాత్రి ‘స్టార్’ స్టేటస్ సంపాదించేస్తుంటారు. వాళ్ల కెరీర్లు అనూహ్యమైన మలుపు తిరుగుతుంటాయి. కెరీర్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో మొదలైనప్పటికీ.. ఆ సినిమాలతో వచ్చిన పేరుతో టాప్ స్టార్ల సరసన అవకాశాలు అందుకున్న హీరోయిన్లు చాలామందే కనిపిస్తారు.
ఇలియానా, సమంతా, తమన్నా.. ఇలా ఈ కోవలో చాలామందే కనిపిస్తారు. ఇప్పుడు ‘పెళ్ళిసంద-డి’ భామ శ్రీలీల దశ కూడా ఇలాగే తిరిగినట్లుగా కనిపిస్తోంది. ‘పెళ్ళిసంద-డి’ చిత్రానికి చాలా బ్యాడ్ టాక్ వచ్చినా సరే… ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయవంతం అయ్యిందంటే, మంచి వసూళ్లు వచ్చాయంటే అందులో శ్రీలీల పాత్ర కీలకం. చూడగానే వారెవా అనిపించే అందం, చక్కటి హావభావాలు పలికించే కళ్లు, ముఖచిత్రం ఉన్న ఈ అమ్మాయి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.
ఇలాంటి అమ్మాయిలను తమ సినిమాల్లో పెట్టుకునే విషయంలో ఫిలిం మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయరు. ‘పెళ్ళిసంద-డి’ చేస్తుండగానే ఆమె గురించి విని రవితేజ కొత్త సినిమాకు కథానాయికగా బుక్ చేయడం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ తర్వాత శ్రీలీల పేరు మార్మోగుతుండటంతో ఓ పెద్ద సినిమాకు ఆమెను కథానాయికగా పరిగణిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అది జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ కావడం వివేషం.
ఈ చిత్ర కథానాయికల విషయం ఎంతకీ తెగట్లేదు. కియారా అద్వానీ, జాన్వి కపూర్.. ఇలా చాలా పేర్లే వినిపించాయి. సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటుందని కూడా అంటుండగా.. ఒక్క హీరోయిన్ కూడా ఇంకా ఫైనలైజ్ అయినట్లుగా కనిపించడం లేదు. ఇంకా స్క్రిప్టు పూర్తి కాని ఈ చిత్రానికి ఓ హీరోయిన్‌గా శ్రీలీలను పరిశీలిస్తున్నారని.. ఆమె ఓకే కావడం దాదాపు ఖాయం అని అంటున్నారు. ఇదే నిజమైతే మాత్రం శ్రీలీల టాప్ హీరోయిన్లలో ఒకరైపోవడం లాంఛనమే.
This post was last modified on October 28, 2021 10:04 pm
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో దసరా తర్వాత మరో వంద కోట్ల గ్రాసర్ గా నిలిచిన సరిపోదా శనివారం…
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ క్యాన్సర్ తో పోరాడుతూ ‘దేవర’ సినిమా చూడాలని ఉందని కోరిన వీడియో గతంలో వైరల్…
కరోనా దెబ్బకు ఆల్రెడీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఏవైనా పెద్ద, ఈవెంట్ సినిమాలు రిలీజైనపుడే థియేటర్లు…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి…
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…