గత రెండు దశాబ్దాల్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన గొప్ప ఆర్టిస్టుల్లో నవాజుద్దీన్ సిద్ధిఖి ఒకడు. అతడి ప్రతిభ గురించి చెప్పడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఐతే అతడి వ్యక్తిగత జీవితం ఈ మధ్య వివాదాలకు కారణమవుతోంది. నవాజుద్దీన్‌ను పెద్ద శాడిస్టుగా పేర్కొంటూ అతడి నుంచి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది భార్య ఆలియా. నవాజ్‌ను ప్రేమించి.. రెండో పెళ్లి చేసుకుని తన పేరును కూడా మార్చుకుందామె.
కానీ ఇప్పుడు అతడిలోని ప్రతికూల కోణాలన్నీ బయటపెడుతూ విడాకులకు రెడీ అయింది. నవాజ్‌తో పాటు అతడి కుటుంబం మీదా ఆమె అనేక ఆరోపణలు చేసింది. ఇప్పుడు నవాజ్ కుటుంబం మీద మరో మహిళ ఆరోపణలతో మీడియా ముందుకొచ్చింది.
నవాజుద్దీన్ సోదరుడు తనను లైంగికంగా వేధించాడని అతడి మేనకోడలే ఆరోపించింది. ఈ మేరకు దిల్లీలోని జామియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ‘‘కొన్నేళ్ల క్రితం నవాజుద్దీన్ సోదరుడు నాతో తప్పుగా ప్రవర్తించాడు. లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని అప్పుడే నవాజుద్దీన్ అంకుల్‌కు చెబితే నమ్మలేదు. ‘అతడు నీకు మామయ్య.. అలా ప్రవర్తించడు’ అని చెప్పాడు’ అని ఆ అమ్మాయి మీడియాకు తెలిపింది. ఈ ఘటనపై ఆలియా ట్విట్టర్లో స్పందించడం గమనార్హం.
‘‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా బయటపడాల్సిన షాకింగ్ నిజాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఈ ప్రపంచానికి తెలియాలి. నవాజుద్దీన్ కుటుంబ సభ్యుల వల్ల నేనొక్కదాన్నే బాధలు అనుభవించలేదు. నిజాలెన్ని బయటపడతాయో.. డబ్బుకు ఎన్ని అమ్ముడుపోతాయో చూద్దాం’’ అని ఆలియా పేర్కొంది. నటుడిగా మంచి స్థాయిలో ఉన్న నవాజ్‌కు ఈ వ్యవహారాలు పెద్ద తలనొప్పిగా మారేలా ఉన్నాయి.a
Gulte Telugu Telugu Political and Movie News Updates