బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్ ఖాన్ రిలేషన్ లో ఉన్నట్లు బీ-టౌన్ టాక్. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. హృతిక్ రోషన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సుసాన్ ఖాన్. 2000వ సమత్సరంలో హృతిక్ ను పెళ్లి చేసుకొని పద్నాలుగేళ్ల పాటు అతడితో కలిసి జీవించింది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అధికారికంగా వీరు వేరయినప్పటికీ.. పిల్లల కోసం కలుస్తుండేవారు.
ఇప్పటికీ కూడా హృతిక్-సుసాన్ తమ పిల్లలతో కలిసి ట్రిప్ లకు వెళ్తుంటారు. పెళ్లి బంధానికి గుడ్ బై చెప్పుకున్నప్పటికీ.. స్నేహితుల్లా కలిసి ఉంటున్నారు. అటు షారుఖ్ కానీ ఇటు సుసాన్ ఖాన్ రెండో పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు సుసాన్ రిలేషన్షిప్ ఉన్నట్లు తెలుస్తోంది. అతడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడం విశేషం.
అతడి పేరు అర్స్లన్ గోనీ. సుసాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకి విషెస్ చెబుతూ.. హ్యాపీ బర్త్ డే డార్లింగ్ అంటూ మొదలుపెట్టి ముద్దులతో ముగించాడు. ఈ పోస్ట్ చూసిన సుసాన్ వెంటనే రియాక్ట్ అవుతూ.. ‘మై ఎవ్రిథింగ్’ అంటూ రిప్లై ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫైనల్ గా ఓపెన్ అయ్యారు.. ఇప్పుడు పెళ్లి చేసుకోండి అంటూ సలహాలు ఇస్తున్నారు. మరి వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారా..? లేక మంచి స్నేహితులా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సివుంది. సోషల్ మీడియాలో జనాలైతే మాత్రం సుసాన్ ఖాన్ రిలేషన్ లో ఉందని ఫిక్సయిపోయారు.
This post was last modified on October 27, 2021 8:09 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…