హీరోయిన్లంతా నిర్మాతలవుతున్నారు. ఓవైపు నటిస్తూనే మరోవైపు ప్రొడక్షన్‌లోకి దిగి నాలుగు కాసులు వెనకేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ నుంచి అప్‌కమింగ్ హీరోయిన్ అవికా గోర్ వరకు ఇదే పాలసీని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు అమలా పాల్ కూడా అదే స్టెప్ వేసి సర్‌ప్రైజ్ చేసింది.
మొదట్లో గ్లామర్ హీరోయిన్‌గా మాత్రమే కనిపించిన అమల.. రూటు మార్చి డిఫరెంట్ కాన్సెప్టుల్ని ఎంచుకుంటోంది. ముఖ్యంగా థ్రిల్లర్స్‌పై ఇంటరెస్ట్ చూపిస్తోంది. రీసెంట్‌గా చేసిన ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్ థ్రిల్లరే. ఇప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీతోనే నిర్మాతగా తొలి అడుగు వేస్తోంది. అనూప్ ఎస్ ప్యానికర్ డైరెక్టర్ చేస్తున్న ‘కడావర్’ను నిర్మిస్తూ లీడ్ రోల్ చేస్తోంది అమల. తన పుట్టినరోజు సందర్భంగా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మార్చురీలో శవాల మధ్య కూర్చుని భోజనం చేస్తోంది అమల. పక్కనే ఓ గాజు సీసాలో కట్ చేసిన అవయవాలు కూడా ఉన్నాయి. ఒళ్లు గగర్పొడిచేలా ఉన్న ఈ పోస్టర్‌కి సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
ఓ సిటీలో జరిగే సీరియల్ కిల్లింగ్స్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో అమల ఫోరెన్సిక్ సర్జన్ పాత్ర చేస్తోంది. ఆ ప్రొఫెషన్‌లో ఉన్న చాలామందిని కలిసిన తర్వాతే ఈ పాత్ర చేయడానికి రెడీ అయ్యిందట. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లో నటించడం, తానే నిర్మించడం చాలా ఎక్సయిటింగ్‌గా ఉందని చెబుతోంది. ఆమధ్య మలయాళంలో ‘ఫోరెన్సిక్’ అనే సినిమా వచ్చింది. టోవినో థామస్ హీరోగా చేశాడు. మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలో నటించింది. ఆ మూవీ చాలా మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అమల కూడా అలాంటి సబ్జెక్ట్‌నే ఎంచుకోవడం విశేషం.
కాన్సెప్టులంటే కొత్తగా ఉండేవి ఎంచుకుంటోంది కానీ నటిగా సక్సెస్ రేటు తక్కువగానే ఉంది అమలకి. ఓ మంచి హిట్టు కోసం ఆశగా ఎదురు చూస్తోంది. మరి నిర్మాతగా ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి. మరోవైపు నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ‘ద ఘోస్ట్’ మూవీలో హీరోయిన్‌గా అమలను తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ తప్పుకోవడంతో అమలను రీప్లేస్ చేశారట. యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ కాబట్టి అమల్ మంచి చాయిస్ అనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే ఈ ఇయర్ అమల కెరీర్ ఊహించని మలుపేదో తీసుకుంటోందనిపిస్తోంది.
This post was last modified on October 26, 2021 10:35 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…