కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకుని రెండున్నర నెలలు దాటింది. ఈ కాలంలో ప్రతి వారం ఒకటికి మించే సినిమాలు రిలీజవుతూ వచ్చాయి. అందులో ఒక్కటైనా చెప్పుకోదగ్గ సినిమా ఉండి ప్రేక్షకులను టాక్‌తో సంబంధం లేకుండా రిలీజ్ రోజు వరకైనా థియేటర్ల వైపు ఆకర్షించేది. కానీ ఈ వారం మాత్రం కొత్త సినిమాల కళ ఏమాత్రం కనిపించడం లేదు. పేరుకు మూణ్నాలుగు సినిమాలు రిలీజయ్యాయి కానీ.. వాటిలో కాస్తో కూస్తో ప్రేక్షకుల దృష్టిలో పడిందంటే.. నాట్యం మాత్రమే.
రామ్ చరణ్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రావడం.. చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్లు ప్రమోట్ చేయడంతో ఈ సినిమాకు కొంత బజ్ కనిపించింది. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేకపోవడం, మంచి ఉద్దేశంతో తీసిన చిత్రమే అయినా.. కథనం బోరింగ్‌గా ఉండటంతో సినిమా ప్రేక్షకుల ఆసక్తిని నిలబెట్టలేకపోయింది. పేరున్న నటీనటులు కూడా ఎవరూ లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ అయింది. దీంతో తొలి రోజు నుంచే ఈ సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి.
ఇక ఈ వారం వచ్చిన మిగతా చిత్రాల గురించి చెప్పడానికేమీ లేదు. మధుర వైన్స్ అని మందు, ప్రేమ చుట్టూ తిరిగే ఓ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు కూడా ఏమంత మంచి టాక్ రాలేదు. అసలు ప్రేక్షకుల్లో దీని గురించి పెద్దగా చర్చే లేదు.
ఇక అసలేం జరిగింది అంటూ ఇంకో చిన్న సినిమా కూడా ఈ వీకెండ్లో ప్రేక్షకులను పలకరించింది. తెలుగువాడైన తమిళ కథానాయకుడు శ్రీరామ్ హీరోగా నటించిన ఈ హార్రర్ మూవీలో కాన్సెప్ట్ బాగున్నా ఎగ్జక్యూషన్ బ్యాడ్‌గా ఉండటంతో ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా నామమాత్రంగా రిలీజైంది. క్లిక్ అంటూ వచ్చిన ఇంకో సినిమా కూడా అంతే. మొత్తంగా ఈ వీకెండ్లో కొత్త సినిమాలేవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోవడంతో గత వారం వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్ళిసంద-డి చిత్రాలే వీకెండ్‌ను క్యాష్ చేసుకునేలా కనిపిస్తున్నాయి.
This post was last modified on October 24, 2021 12:46 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…