తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అత్యంత సీనియర్ స్టార్ అయిన బాలకృష్ణని కచ్చితంగా అందులో ఇన్వాల్వ్ చేయాలి. కానీ చిరంజీవి ఎందుకో బాలయ్యని దూరం పెడుతూ తనకు సన్నిహితుడైన నాగార్జునని మాత్రమే అన్నిట్లో కలుపుకుపోతున్నారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధి గురించి బాలయ్యతో సంప్రదింపులు లేవు.
అయినప్పటికీ ఆయన సి. కళ్యాణ్ చేతులకు కోటి రూపాయల విరాళం తాలూకు చెక్ అందించారు. అలాగే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లే సందర్భంలో కూడా బాలయ్యను వెంట తీసుకెళ్లలేదు. నిజానికి చిరంజీవికి ఆయనని పిలవాలనే ఉందట. ఇద్దరి మధ్య సంబంధాల మాట ఎలా ఉన్నా మీడియా కనుక బాలయ్య రాకపోవడం చూస్తే కూపీ లాగుతుందని చిరంజీవికి తెలుసు.
కానీ చిరంజీవితో చర్చకు వెళ్లిన వారిలో కొందరు బాలకృష్ణ దేనికని, ఆయన రావాల్సిన పని లేదని చిరంజీవికి చెప్పారట. తీరా చిరంజీవి అనుకున్నంత పనీ అయింది. బాలకృష్ణకు సింపతీ వచ్చి, చిరంజీవిపై ఒక వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on June 4, 2020 1:30 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…