ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర రసవత్తర సమరం చూశాం. టాలీవుడ్ టాప్ స్టార్లు మహేష్ బాబు, అల్లు అర్జున్ తలపడ్డారు. ఇద్దరిలో బన్నీ సినిమా ‘అల వైకుంఠపురములో’దే పైచేయి అయినా.. మహేష్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా బాగానే ఆడింది.
వీళ్లిద్దరూ వచ్చే ఏడాది కూడా బాక్సాఫీస్ వార్‌కు రెడీ అయితే ఆశ్చర్యమేమీ లేదు. వీళ్లిద్దరి కొత్త చిత్రాలు వచ్చే వేసవిని టార్గెట్ చేశాయి. ముందు అనుకున్న ప్రకారం అయితే మహేష్, బన్నీల కొత్త సినిమాలు ఈ ఏడాదే విడుదల కావాలి. కానీ కరోనా వారి ప్రణాళికల్ని మార్చేసింది. మహేష్ కొత్తగా ఇప్పుడే పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను అనౌన్స్ చేశాడు. మరోవైపు బన్నీ-సుకుమార్‌ల కలయికలో ‘పుష్ప’ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.
లేటుగా అనౌన్స్ చేసినప్పటికీ మహేష్-పరశురామ్‌ల సినిమా పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగబోతోంది. షూటింగ్స్ పున:ప్రారంభం కాగానే ఈ సినిమా పట్టాలెక్కేస్తుంది. వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని పక్కాగా విడుదల చేసే అవకాశముంది.
బన్నీ-సుకుమార్ సినిమా టార్గెట్ కూడా ప్రస్తుతానికి వేసవే. ఈ ఏడాది లాగా ఒకే వారంలో ఈ ఇద్దరి సినిమాలు పోటీకి దిగకపోవచ్చు. వేసవి సీజన్ కాబట్టి కొంచెం గ్యాప్‌లో ఢీకొడతారు. ఐతే బన్నీ సినిమా కచ్చితంగా వేసవికి వస్తుందనడానికి కూడా లేదు. సుక్కు టేకింగ్ సంగతి అందరికీ తెలిసిందే.
పర్ఫెక్షన్ కోసం చెక్కుతూ వెళ్తాడు. ఈ క్రమంలో ఆలస్యం జరుగుతుంది. ఆయన చేతుల్లో ఏదీ ఉండదు. ఐతే షూటింగ్ మొదలై కొన్ని రోజులు గడిచాక ఈ విషయంలో స్పష్టత రావచ్చు. ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరిగిన నేపథ్యంలో సుకుమార్‌పై ఒత్తిడి ఉంటుందనడంలో సందేహం లేదు. మరి వచ్చే వేసవికి కొంచెం విరామంతో అయినా మహేష్, బన్నీ తలపడతారేమో చూడాలి.
This post was last modified on June 3, 2020 4:11 pm
ఈ ఏడాది దీపావళి టాలీవుడ్‌కు భలే కలిసి వచ్చింది. తెలుగు నుంచి రిలీజైన లక్కీ భాస్కర్, క చిత్రాలతో పాటు…
500 కోట్ల రూపాయల ప్రజాధనం దుబారా చేసి విశాఖలోని రుషికొండకు గుండు కొట్టి మరీ అక్కడ ఖరీదైన ప్యాలెస్ ను…
తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, మైక్ ఇవ్వరేమోనని తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని పులివెందుల…
టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడు తున్నాయి. ఇది ఏదో…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన ‘పుష్ప-2’ విడుదలకు ఇంకో 20 రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ…
ఇండస్ట్రీలో ఏ బ్యాగ్రౌండ్ లేకుండా కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వాళ్లను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకోరు. కానీ వాళ్లే మంచి…