ఈ రోజుల్లో బాగుంది అన్న టాక్ తెచ్చుకున్న సినిమాలకే వసూళ్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అలాంటిది టాక్ కొంచెం అటు ఇటుగా ఉంటే అంతే సంగతులు. కానీ దసరా కానుకగా విడుదలైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మాత్రం డివైడ్ టాక్‌ను తట్టుకుని బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది. ఆ సినిమాకు కొన్ని అంశాలు బాగా కలిసొచ్చాయి.
అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పూజా హెగ్డే గురించి. తన గ్లామర్‌తో తెలుగు కుర్రాళ్లను కట్టి పడేస్తున్న ఈ భామ.. తన కోసమే థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే స్థాయిలో ఇమేజ్ తెచ్చుకుంది. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతుండటం కూడా ఆమెకు ఇంకో ప్లస్ కాగా.. సినిమాలో హీరోను మించి కీలకమైన పాత్రలో ఆమె ఆద్యంతం ఆకట్టుకుంది.
అందం, అభినయం రెండింట్లోనూ పూజా సినిమాకు ముఖ్య ఆకర్షణగా నిలిచింది. అలాగే సినిమాకు పాటలు ప్లస్ అయ్యాయి. అన్నింటికీ మించి దసరా సెలవుల్లో సినిమాను రిలీజ్ చేయడం, దీనికి పోటీగా వచ్చిన చిత్రాలకు పూర్తి నెగెటివ్ టాక్ రావడం కలిసొచ్చింది. ఇలా అన్ని అంశాలూ తోడై ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్ అనిపించుకుంది.
ఐతే ఎలా అయితేనేం.. తొలి విజయం కోసం ముఖం వాచిపోయి ఉన్న అక్కినేని వారసుడు అఖిల్ ఖాతాలో ఒక హిట్ పడింది. ఇది అఖిల్‌కే కాక అక్కినేని కుటుంబానికి, ఆ కుటుంబ అభిమానులకు ఎంతో ఊరటనిచ్చే విజయం. తొలి సినిమా ‘అఖిల్’తోనే పెద్ద స్టార్ అయిపోతాడనుకున్న కుర్రాడు.. ఇప్పుడిలాంటి స్థితిలో ఉంటాడని ఎవ్వరూ ఊహించలేదు.
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సక్సెస్ క్రెడిట్లో అఖిల్‌కు ఎంత వస్తుందన్నది పక్కన పెడితే.. అతడి కెరీర్‌కు ఒక బేస్ ఏర్పడింది. దీని మీద అతనింక ఎలా ఎదుగుతాడన్నది కీలకం. నటన, స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో అఖిల్ మెరుగవ్వాలన్నది స్పష్టం. అలాగే తన భుజాల మీద సినిమాను నడిపించేలా సత్తా చూపించాలి.
‘ఏజెంట్’ ఈ విషయంలో అతడికి పర్ఫెక్ట్ మూవీ అని చెప్పొచ్చు. తొలి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ఆ ఆత్మవిశ్వాసాన్నంతా ఈ సినిమాలో చూపించి తనేంటో అందరికీ అఖిల్ చాటి చెబుతాడేమో చూడాలి. ఆ సినిమాలో ఇంకెవరి మీదా ఆధారపడకుండా అఖిల్ పెద్ద హిట్ కొట్టగలిగితే అతను హీరోగా నిలదొక్కుకున్నట్లే.
This post was last modified on October 21, 2021 11:44 am
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…