‘సాహో’ లాంటి యాక్షన్ మూవీ తర్వాత ‘రాధేశ్యామ్’ లాంటి లవ్‌స్టోరీతో వస్తానని ప్రకటించాడు ప్రభాస్. 2018 సెప్టెంబర్‌లో సినిమా లాంచ్ అయ్యింది. 2022 జనవరిలో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యలో అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంత ఆరాటపడ్డారో తెలిసిందే. ఎట్టకేలకి వారి ఎదురు చూపులు ఫలించాయి. మూవీ టీజర్ రిలీజ్ కాబోతోంది.
ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే చాలాసార్లు ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ అప్‌డేట్ కోసం ఎదురుచూసి డిజప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. దాంతో టీజర్ వస్తుందా లేక ప్రభాస్ పోస్టర్‌ని రిలీజ్ చేసి సరిపెట్టుకోమంటారా అనే అనుమానాలూ ఉన్నాయి. లక్కీగా టీజర్ రిలీజ్‌కే ఫిక్సయ్యింది టీమ్. 23న ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయనున్నామని, ఈ టీజర్‌తో విక్రమాదిత్య ఎవరో తెలుసుకుంటారని యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది.
యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరీ ఇది. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటించారు. మూడొందల కోట్ల భారీ బడ్జెట్‌తో మూడున్నరేళ్లకు పైగా తెరకెక్కించాడు రాధాకృష్ణ కుమార్. అన్నేళ్లు తీసేంతగా ఈ సినిమాలో ఏముందో చూడాలని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి టీజర్‌తో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారో చూడాలి.
This post was last modified on October 20, 2021 3:56 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు.…
ఎవరైనా సంగీత దర్శకుడికి పేరొచ్చేది అతనిచ్చే మొదటి ఆల్బమ్ ని బట్టే. అది హిట్టయ్యిందా అవకాశాలు క్యూ కడతాయి. లేదూ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ…
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…