Movie News

స‌ర్జ‌రీ హీరోయిన్ల‌కు రాధిక కౌంట‌ర్

నో ఫిల్ట‌ర్ లుక్.. సోష‌ల్ మీడియాలో ఇదొక ట్రెండ్ ఇప్పుడు. మేక‌ప్ వేయ‌కుండా.. టెక్నాల‌జీ ద్వారా మెరుగులు దిద్ద‌కుండా తాము ఒరిజిన‌ల్‌గా ఎలా ఉన్నామో అలాగే ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం హీరోయిన్ల‌కు ఫ్యాష‌న్‌గా మారిందీ మ‌ధ్య‌.

కొంద‌రు లైట్ మేక‌ప్ వేసి.. నో ఫిల్ట‌ర్ అంటూ మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇంకొంద‌రు లైట్‌గా టెక్నాల‌జీ సాయంతో ఫొటోలు మెరుగులు దిద్దుతుంటారు. ఐతే ఇవేమీ చేయ‌కుండా ఒరిజిన‌ల్ ఫొటోలు పెట్టేవాళ్లూ ఉంటారు.

ఐతే ఇదేమీ పెద్ద గొప్పేమీ కాదంటోంది డాషింగ్ హీరోయిన్ రాధికా ఆప్టే. హీరోయిన్ల‌లో చాలామంది స‌ర్జ‌రీల ద్వారా త‌మ అందాల‌కు మెరుగులు దిద్దుకుంటూ ఉంటారని.. ఈ నో ఫిల్ట‌ర్ ఫొటోలు పెట్ట‌డం ద్వారా ముందు ఆ స‌ర్జ‌రీలు ఆపాల‌ని కౌంట‌ర్లు వేసింది రాధికా.

వ‌క్షోజాల సైజు పెంచుకోవ‌డం కోసం.. ముక్కును స‌రి చేసుకోవ‌డం కోసం.. ఇంకా కొన్ని లోపాలు స‌రిదిద్దుకోవ‌డం కోసం హీరోయిన్లు స‌ర్జ‌రీల‌ను ఆశ్రయించ‌డం మామూలే. ఇలా స‌ర్జ‌రీల‌కు వెళ్లి ముఖార‌విందాన్ని పెంచుకున్న వాళ్లూ ఉన్నారు. అలాగే దెబ్బ తీసుకున్న వాళ్లూ ఉన్నారు.

శ్రీదేవి, శ్రుతి హాస‌న్ లాంటి వాళ్లు ముఖానికి చేయించుకున్న చిన్న స‌ర్జ‌రీల గురించి బ‌య‌టికి చెప్పుకున్నారు. కానీ ఈ విష‌యాలు బ‌య‌టికి చెప్ప‌కుండా దాచిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఐతే బ‌య‌టికి చెప్పినా, చెప్ప‌కున్నా.. ఇలాంటి స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డ‌మే క‌రెక్ట్ కాదంటోంది రాధికా.

నో ఫిల్ట‌ర్ లుక్స్ అంటూ ఫొటోలు షేర్ చేయ‌డం ఏముంద‌ని.. అంత‌కంటే ముందు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం హీరోయిన్లు మానాలని ఆమె అంది. స‌హ‌జ సౌంద‌ర్యంతో కాకుండా స‌ర్జ‌రీలు చేయించుకుని అందం పెంచుకుని ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో ఏ ప్ర‌త్యేక‌తా లేద‌ని రాధిక పేర్కొంది.

This post was last modified on October 20, 2021 8:08 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

5 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

7 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

7 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago