ఇండియాలో వెబ్ సిరీస్ కల్చర్ బాగా ఊపందుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిరీస్‌ల్లో ఒకటి ‘ఫ్యామిలీ మ్యాన్’ అయితే.. ఇంకోటి ‘స్పెషల్ ఆప్స్’. ఈ రెండు సిరీస్‌లూ అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం వెబ్ సిరీస్‌లకు అలవాటు పడేలా చేశాయి.
ఈ రెండు సిరీస్‌ల్లోనూ ఉత్కంఠకు లోటు ఉండదు. అదే సమయంలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఇందులో కీలకంగా ఉంటాయి. ఏ ఎపిసోడ్‌కు ఆ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠ రేపుతూ సాగి ప్రేక్షకులను ఆద్యంతం అలరింపజేస్తాయి. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్’కు ఇప్పటికే సీక్వెల్ వచ్చేసింది.
రెండో సీజన్ కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించి సూపర్ హిట్టయింది. ఇక అందరి దృష్టీ మూడో సీజన్ మీదికి మళ్లింది. ఇప్పుడు ‘స్పెషల్ ఆప్స్’కు సైతం సీక్వెల్ రెడీ అయిపోయింది. నవంబరు 12నే రెండో సీజన్ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కాబోతోంది.
‘స్పెషల్ ఆప్స్ 1.5’ పేరుతో రానున్న ఈ సిరీస్‌కు ట్రైలర్ లాంచ్ చేశారు. పార్లమెంటు మీద దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది జాడను హిమ్మత్ సింగ్ కనిపెట్టి తన టీంతో కలిసి అతడి భరతం ఎలా పట్టాడనే నేపథ్ంయలో ‘స్పెషల్ ఆప్స్’ తొలి సీజన్ నడుస్తుంది.
రెండో సీజన్‌కు వచ్చేసరికి అసలు హిమ్మత్ సింగ్ అనేవాడికి ఇంత గొప్ప ఆఫీసర్‌గా ఎలా పేరు వచ్చింది.. అతడి నేపథ్యం ఏంటి.. కెరీర్ ఆరంభంలో అతను ఎందుకు సస్పెండయ్యాడు.. తర్వాత తిరిగి డిపార్ట్‌మెంట్లోకి ఎలా వచ్చాడు.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో ఒక ముఖ్యమైన ఆపరేషన్‌ను ఎలా నడిపించి ఉపద్రవాన్ని తప్పించాడు అనే నేపథ్యంలో సెకండ్ సీజన్ నడవబోతోందని ట్రైలర్ సంకేతాలు ఇచ్చింది.
నీరజ్ పాండే క్రియేట్ చేసిన ఈ సిరీస్.. తొలి సీజన్ లాగే ఉత్కంఠభరితంగా సాగుతూ, ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ ఇస్తుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కేకే మీనన్ మరోసారి ప్రేక్షకుల మనసులు దోచేలాగే కనిపిస్తున్నాడు.
This post was last modified on October 19, 2021 11:30 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…