సోషల్ మీడియా పుణ్యమా అని ఉన్నట్లుండి అనామకులు తెగ పాపులర్ అయిపోతుంటారు. కొన్ని క్షణాల వీడియోలతో సూపర్ పాపులర్ అయిపోయిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇలా పాపులర్ అయినవాడే శరత్. ఈ పేరు చెబితే ఎవరో తెలియకపోవచ్చు కానీ.. ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ సుఖీభవ’’ అంటూ సాగే వీడియోను గుర్తు చేస్తే అందరికీ అతనెవరో తెలిసిపోతుంది.
ఒక టీ ప్రాడక్ట్ యాడ్‌ను అనుకరిస్తూ తమాషాగా అతను చేసిన డ్యాన్స్ భలే వైరల్ అయింది. కోట్ల మందికి ఆ కుర్రాడిని పరిచయం చేసింది. దీని మీద ఎన్ని మీమ్స్ వచ్చాయో లెక్కే లేదు. ట్రోల్ కంటెంట్‌కు అతణ్ని చాలా బాగా వాడేసింది సోషల్ మీడియా. పేరు తెలియకుండానే బాగా పాపులర్ అయిపోయిన ఈ కుర్రాడు.. ఉన్నట్లుండి మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. ఎవరో అతణ్ని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలై కనిపించాడు.
శరత్ మీద ఎవరు ఎందుకు దాడి చేశారనే విషయంలో గత రెండు రోజుల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే మంగళవారం శరత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనపై ఎవరు ఎందుకు దాడి చేశారో వెల్లడించాడు. ‘‘నేనంటే పడని వ్యక్తులు నా మీద దాడి చేశారు. గతంలో నా చెల్లిని వేధింపులకు గురి చేస్తుంటే సాయి, హరి అనే వ్యక్తులను కొట్టాను. ఆ కేసులో నేను గతంలో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటికి వచ్చాను.
నేను ఇలా బయటికి రాగానే నాకు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి. ఒక యాడ్ చేయడానికి కూడా ఆఫర్ ఇచ్చారు. ఐతే ఇదంతా జీర్ణించుకోలేక.. నా ఎదుగుదల నచ్చక నాపై విచక్షణా రహితంగా దాడి చేశారు. నన్ను కొట్టిన వాళ్ల మీద రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’’ అని ముఖం మీద దెబ్బలతోనే మీడియాతో మాట్లాడుతూ వివరించాడు శరత్.
This post was last modified on October 19, 2021 11:26 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…