Movie News

రవితేజ అంచనా తప్పలేదు!

దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మహాసముద్రం’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. విడుదలకు ముందు సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీంతో ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ నెగెటివ్ రివ్యూస్, బ్యాడ్ టాక్ తో సినిమాపై ఆసక్తి సన్నగిల్లింది. ఫైనల్ గా ఇదొక ప్లాప్ సినిమాగా తేల్చేశారు. ఈ ప్లాప్ ఎఫెక్ట్ శర్వానంద్ మీద కంటే దర్శకుడు అజయ్ భూపతిపై బాగా పడింది.

‘ఆర్ఎక్స్100’ లాంటి సెన్సేషనల్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఈ సినిమాలో నటించిన కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు మంచి క్రేజ్ వచ్చింది. పాయల్ బోల్డ్ సీన్స్, క్లైమాక్స్ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించాయి. దీంతో దర్శకుడు అజయ్ భూపతికి చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అవకాశాలు వచ్చాయి. ‘మహాసముద్రం’ లాంటి మల్టీస్టారర్ కథ రాసుకున్న అజయ్ భూపతి ముందుగా నాగచైతన్యను సంప్రదించారు. చైతు ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ.. ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.

ఫైనల్ గా రవితేజ సినిమాకి ఓకే చెప్పడంతో స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు అజయ్ భూపతి. రవితేజ-సిద్ధార్థ్ లను హీరోలుగా అనుకున్నాడు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయాలని రవితేజ సూచించారు. ముఖ్యంగా కథలో ‘మహా’ క్యారెక్టర్ కు సంబంధించిన కొన్ని మార్పులు చేయమని కోరాడు రవితేజ. కానీ అజయ్ భూపతి ఆ సలహాలను పట్టించుకోలేదు. దీంతో రవితేజ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ సమయంలో అజయ్ భూపతి ట్విట్టర్ వేదికగా రవితేజను టార్గెట్ చేస్తూ ‘అన్ ప్రొఫెషనల్ బిహేవియర్’ అంటూ పోస్ట్ పెట్టాడు.

చివరకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకొని శర్వానంద్ ను రంగంలోకి దింపింది. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో రవితేజ బాగానే తప్పించుకున్నాడంటూ ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రవితేజ.. అజయ్ భూపతి జడ్జిమెంట్ తప్పని నిరూపించాడు.

This post was last modified on October 19, 2021 11:12 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago