Movie News

‘అఖండ’ పండుగ సందడి లేనట్లే

నందమూరి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న సినిమా ‘అఖండ’. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ముందు అనుకున్న ప్రకారమైతే మేలోనే ఈ చిత్రం విడుదల కావాల్సింది. కరోనా వల్ల ఆలస్యం తప్పలేదు. ఆ తర్వాత దసరా రిలీజ్ అన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆపై దీపావళి మీదికి ఫోకస్ మళ్లింది.

దీపావళికి నెల రోజుల సమయం ఉండగానే సినిమా షూటింగ్ పూర్తి కావడంతో పండక్కి బాలయ్య సందడి ఉంటుందనే ఆశతోనే ఉన్నారు అభిమానులు. మీడియాలో కూడా దీని గురించి ప్రచారం జరిగింది. కానీ ‘అఖండ’ టీం నుంచి మాత్రం ఈ విషయంలో ఎలాంటి అప్‌డేట్ లేదు. దసరా రోజు దీపావళి రిలీజ్ గురించి ప్రకటన ఉంటుందని.. కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారని అన్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు.

దసరా రోజు కనీసం పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ కూడా వదల్లేదని.. రిలీజ్ గురించి అప్‌డేటే లేదని నిర్మాణ సంస్థ ‘ద్వారక క్రియేషన్స్‌’ను ట్విట్టర్లో నందమూరి అభిమానులు ఉదయం నుంచి తిడుతూనే ఉన్నారు. అయినా సాయంత్రానికి కూడా చలనం లేదు. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘అఖండ’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఆలస్యం జరుగుతుండటంతో దీపావళి విడుదల సాధ్యం కాదని ఫిక్సయిపోయారట.

క్రిస్మస్, సంక్రాంతి సీజన్లకు బెర్తులు బుక్ అయిపోయిన నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబరు తొలి వారంలో రిలీజ్ చేయడానికి చూస్తున్నారట. త్వరలోనే దీని గురించి ప్రకటన ఇస్తారని అంటున్నారు. కాబట్టి దీపావళికి రజినీకాంత్ తమిళ అనువాద చిత్రం ‘పెద్దన్న’తో పాటు మారుతి చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’, పూరి ఆకాశ్ మూవీ ‘రొమాంటిక్’లకు ఫిక్సయిపోవచ్చు.

This post was last modified on October 15, 2021 5:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

11 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

23 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago