సోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు రోజు రోజుకూ శ్రుతిమించి పోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఎవరో హీరోయిన్ తన ఫాలోవర్లతో చిట్ చాట్ పెడుతుంది. అందులో ఫలానా హీరో గురించి మీ అభిప్రాయం ఏంటి అంటారు. ఆమె పొగిడిందంటే ఆ ట్వీట్‌ను పట్టుకుని తమ హీరోకు ఎలివేషన్ ఇస్తారు. పొరబాటున ఆ హీరోయిన్ నెగెటివ్‌గా స్పందించడమో.. ఇగ్నోర్ చేయడమే చేసిందంటే ఇక అంతే సంగతులు. బూతు పురాణం మొదలైపోతుంది. ఈ విషయంలో హీరోయిన్లు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉంటారు. కానీ బంగారం, వాన, గ్రీకువీరుడు లాంటి సినిమాల్లో నటించిన ఉత్తరాది భామ మీరా చోప్రా ఇలా లౌక్యంగా వ్యవహరించలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తనకు తెలియదన్న పాపానికి బూతులు తిట్టించుకుంది.
ట్విట్టర్ చిట్ చాట్ సందర్భంగా తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరని ఓ ఫాలోవర్ మీరాను అడిగితే మహేష్ బాబు పేరు చెప్పిందామె. తన బంగారం కోస్టార్ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే.. ఆయనో సూపర్ స్టార్, సూపర్ హ్యూమన్ బీయింగ్ అని సమాధానం ఇచ్చింది. ఐతే ఎన్టీఆర్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. అతనెవరో తనకు తెలియదని అంది. ఒక నెటిజన్ శక్తి, దమ్ము సినిమాలు చూస్తే తారక్ ఫ్యాన్ అయిపోతావ్ అన్నాడు. దానికి బదులుగా తనకంత ఆసక్తి లేదు అంది మీరా. ఇక అంతే తారక్ ఫ్యాన్స్ బూతు పురాణం మొదలైంది. మీరాతో పాటు ఆమె తల్లిదండ్రుల్ని కూడా సీన్లోకి తీసుకొచ్చి తిట్టిపోశారు. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లు సోషల్ మీడియాలో కామన్ అని వదిలేయకుండా మీరా దీన్ని సీరియస్‌గా తీసుకుంది. ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ.. అతడి అభిమానులు తననెలా బూతులు తిడుతున్నారో వివరించింది. ఇలాంటి అభిమానుల్ని పెట్టుకుని నువ్వు సక్సెస్ ఫుల్ ఎలా అవుతావ్ అని ప్రశ్నించింది. తన ట్వీట్‌ను ఇగ్నోర్ చేయొద్దని కూడా కోరింది. మొత్తానికి కొందరు ఫ్యాన్స్ చేసిన అతికి ఇప్పుడు తారక్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
This post was last modified on June 2, 2020 11:17 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…