రాజకీయాల నుంచి బయటపడ్డాక మర్యాద రామన్న అయిపోయాడు చిరంజీవి. ఆయన ఒకరి మీద విమర్శలు చేయడానికి ఇబ్బంది పడతాడు. అదే సమయంలో ఇంకొకరు తనను విమర్శించినా తట్టుకోలేడు. అసలు ఎవరి దృష్టిలోనూ తాను చెడు కాకూడదు, అందరితోనూ మంచిగా ఉండాలి.. మంచోడు అనిపించుకోవాలి అన్న ఒక ఛట్రంలో చిరంజీవి ఇరుక్కుపోయాడేమో అనిపిస్తుంది కొన్నేళ్లుగా ఆయన తీరు గమనిస్తే.
ఇలా మర్యాదరామన్న పాత్ర పోషిస్తున్న సమయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలొచ్చి చిరంజీవిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ ఎన్నికల్లో చిరంజీవి మద్దతుతో ప్రకాష్ రాజ్ బరిలో నిలిచారన్నది స్పష్టం. ఐతే ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్, నాగబాబు చెప్పడమే తప్ప.. చిరంజీవి మాత్రం ఆ మాట బహిరంగంగా చెప్పలేదు. ప్రకాష్ రాజ్‌కు మద్దతూ ప్రకటించలేదు. ఇక్కడ ఆయనకు మొహమాటం అడ్డొచ్చింది. మంచు విష్ణు బరిలో ఉండగా.. ప్రకాష్ రాజ్‌కు ఓపెన్‌గా సపోర్ట్ చేసి మోహన్ బాబుతో తగువు పెట్టుకోవడం చిరంజీవికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు. కానీ చిరు ఇలా ఓపెన్ కాకపోవడం వల్లే ప్రకాష్ రాజ్‌కు పెద్ద డ్యామేజ్ జరిగింది. అదే సమయంలో చిరంజీవి ఇమేజ్‌కూ దెబ్బ పడింది.
ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో ఆ వైఫల్యాన్ని చిరంజీవికి, మెగా ఫ్యామిలీకి అంటగడుతున్నారు. చిరంజీవి సత్తా ఇంతేనా అని ఎద్దేవా చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దగా ఉంటూ, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రకాష్ రాజ్‌ను చిరు గెలిపించుకోలేకపోయాడే అంటున్నారు. ఐతే ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇవ్వాలనుకున్నపుడు చిరు ఆ పని ఓపెన్‌గానే చేయాల్సింది. చిరంజీవి ఆయన గురించి రెండు మాటలు చెప్పి ఓటు వేయమంటే కచ్చితంగా పరిస్థితి భిన్నంగా ఉండేది. చిరంజీవి సపోర్ట్ ప్రకాష్ రాజ్‌కు ఉందని తెలిసీ మోహన్ బాబు తన కొడుకును బరిలో నిలిపినపుడు.. ప్రకాష్ రాజ్‌కు ఓపెన్‌గా సపోర్ట్ చేయడానికి చిరంజీవికి వచ్చిన ఇబ్బందేంటన్నది అర్థం కాని విషయం. ఈ మొహమాటం వల్ల ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓటమికి సంబంధించి ఎంతో కొంత బాధ్యత తీసుకోక తప్పట్లేదు.
This post was last modified on October 11, 2021 9:08 pm
‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ ఎంత డీగ్లామరస్‌గా కనిపిస్తాడో తెలిసిందే. ఒక ఎర్రచందనం కూలీ పాత్ర కావడంతో అందుకు తగ్గట్లు…
కోలీవుడ్‌లో చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించుకున్న దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా.. అంచనాలు…
వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికే చాలా చిక్కుల్లో ఉన్నారు. ఒకవైపు బాబాయి వివేకానందరెడ్డి దారుణ…
క్షేత్రస్థాయిలో టీడీపీ నాయకులకు, ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ నాయకులకు మధ్య వివా దాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.…