కొత్త అపార్ట్మెంట్ కొన్న నాగచైతన్య!

Naga Chaitanya

అక్కినేని నాగచైతన్య-సమంత తమ వివాహబంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ప్రకటించకముందు నుంచే వీరిద్దరూ సెపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవారు. గతేడాది వీరిద్దరూ కలిసి జూబ్లీహిల్స్ లో ఓ బంగ్లా కొనుక్కున్నారు. ఇంటీరియర్, రెన్నొవేషన్ వర్క్ మొత్తం పూర్తయ్యాక కొత్తింట్లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నారు. కానీ ఇంతలో ఇద్దరూ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఆ బంగ్లా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి.

ఈ పనులు పూర్తి కావడానికి మరో ఏడాది సమయం పడుతుంది. అప్పటికి గానీ చైతు అక్కడకు వెళ్లలేరు. అలా అని తన ఫ్యామిలీతో కలిసి ఈ టైమ్ లో ఉండడం చైతుకి ఇష్టం లేదట. కొన్నాళ్లపాటు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని ఓ పోష్ ఏరియాలో కొత్త అపార్ట్మెంట్ తీసుకున్నారు చైతు. కొన్ని రోజుల్లో ఈ అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అవ్వనున్నారు.

ఇటీవలే చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ హీరో.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇదే డైరెక్టర్ రూపొందించనున్న ఓ వెబ్ సిరీస్ లో కూడా చైతు కనిపించబోతున్నాడు. వీటితో పాటు ‘బంగార్రాజు’ సినిమాలో తన తండ్రి నాగార్జునతో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.