నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడినా సంచలనమే. ఆయన కామెంట్లు కొన్ని వింటే.. ఇలా బాలయ్య మాత్రమే మాట్లాడగలడు అనిపిస్తుంది. ఎవరేమనుకుంటారన్నది పట్టించుకోకుండా తనకేమనిపిస్తే అది మాట్లాడుతుంటాడు బాలయ్య.
ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించి తన వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన నేపథ్యంలో బాలయ్య ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చివర్లో కొసమెరుపు లాంటి కామెంట్లు చేశాడు. ప్రతి తెలుగు వాడూ ఎన్టీఆర్ అభిమానే అని.. అలాగే తన అభిమాని కూడా అని బాలయ్య స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం. ముందు ఎన్టీఆర్‌తో మొదలుపెట్టి తర్వాత తన గురించి చెబుతూ పార్టీలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తన అభిమానులే అన్నాడు బాలయ్య.
‘‘చాలా మంది నా దగ్గరికి వచ్చి.. ‘సార్ నేను ఎన్టీ రామారావు గారి అభిమానినండీ’ అంటారు. ‘కాదని చెప్పు.. దమ్ముందా.. పడతది’ అంటా. ప్రతి తెలుగోడూ నా అభిమానే. ప్రతి పార్టీలో వాడూ నా అభిమానే. సమాజమే నా అభిమానం. నాన్నగారు అన్నారు.. సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్లు. అందులో నేను అర్చకుణ్ని అని. నా వంతు అన్ని రకాలుగా కృషి చేస్తున్నా. నా పూజల ద్వార అయితేనేమి.. హస్పిటల్ ద్వారా అయితేనేమి. నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితేనేమి. ఒక ఆర్టిస్టుగా విజ్ఞానం, వినోదం, ఆలోచన రేకెత్తించడంలో అయితేనేమి. ఇన్నిన్ని చేస్తున్నపుడు అందరూ నా అభిమానులే. కులం, మతం, వర్గాలకు అతీతంగా అందరూ నా అభిమానులే’’ అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు బాలయ్య.
ఈ క్రమంలో ‘ఒక్కమగాడు’ సినిమాలోని ‘‘నాకున్న జ్ఞానసంపదలో బ్రాహ్మణుడిని.. ఐశ్వర్యంలో వైశ్యని.. మంచికి మాలని.. వంచిస్తే ఎదిరించే మాదిగని…’’ డైలాగ్ పేల్చాడు బాలయ్య.
This post was last modified on June 4, 2020 1:38 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…