తెలుగులో చేసిన తొలి సినిమా ‘ఒక లైలా కోసం’ ఫ్లాప్. ఆ తర్వాత ఇక్కడ చేసిన ‘ముకుంద’ సైతం నిరాశ పరిచింది. వీటి కంటే ముందు తమిళంలో జీవా సరసన ‘మాస్క్’ అనే సినిమా చేస్తే అది కూడా ఫ్లాపే అయింది. ఇక హిందీలో ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ చిత్రం ‘మొహెంజదారో’ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. పూజా హెగ్డే కెరీర్ ఆరంభంలో ఎదురైన చేదు అనుభవాలివి.
ఒక కథానాయికకు కెరీర్ ఆరంభంలో ఇలా వరుసగా పరాజయాలు ఎదురైతే ఐరెన్ లెగ్ ముద్ర వేసి సాగనంపేస్తారు. కెరీర్లో పుంజుకోవడం చాలా చాలా కష్టం. కానీ కెరీర్‌ను అలా మొదలుపెట్టిన పూజా హెగ్డే.. ఇప్పుడు ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరు. ముఖ్యంగా టాలీవుడ్లో ఆమె ఊపు మామూలుగా లేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె తెలుగులో చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ అనుకున్నంతగా ఆడకపోయినా.. పూజాకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టింది. దీంతో ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేదు.
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్.. ఇలా టాప్ స్టార్లు చాలామందితో సినిమాలు చేసేసింది పూజా. ఇక ఆ లీగ్‌లో మిగిలిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. హరీష్ శంకర్ పుణ్యమా అని పవర్ స్టార్‌తోనూ పని చేసే అవకాశం దక్కింది పూజాకు. పవన్ హీరోగా తాను తెరకెక్కించనున్న ‘భవదీయుడు భగత్ సింగ్’లో పూజానే హీరోయిన్ అని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో వెల్లడించాడు హరీష్.
ఇక తెలుగులో చిరంజీవి తరం సీనియర్ హీరోలను పక్కన పెట్టేస్తే.. టాప్ స్టార్లందరితో పూజా సర్కిల్ పూర్తి కాబోతోంది. వీళ్లు కాకుండా నాగచైతన్య, వరుణ్ తేజ్, అఖిల్ లాంటి యువ కథానాయకులతోనూ సినిమాలు చేసిందామె. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పూజా ఇంత డిమాండ్‌లో లేదు కానీ.. ఇకపై మిడ్ రేంజ్ హీరోలెవ్వరికీ ఆమె దొరికే పరిస్థితి లేదు. మరోవైపు తమిళంలో విజయ్ లాంటి టాప్ స్టార్ సినిమాతో కోలీవుడ్లోకి పూజా రీఎంట్రీ ఇస్తోంది. ‘బీస్ట్’ బాగా ఆడాలి కానీ.. అక్కడ కూడా టాప్ స్టార్లు ఆమె వెంటపడే అవకాశాలు లేకపోలేదు. ఇక హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి బడా హీరోలతో పూజా సినిమాలు చేస్తుండటం విశేషం.
This post was last modified on October 9, 2021 6:14 pm
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…