‘మేమిద్దరం విడిపోతున్నాం’.. కొద్ది రోజుల క్రితం నాగచైతన్య, సమంతలు ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పటికే వాళ్లు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వస్తున్నా, రూమర్స్ అయి ఉంటాయి అనుకున్నారంతా. కానీ ఎప్పుడైతే ఇద్దరూ స్వయంగా ప్రకటించారో అందరూ షాకైపోయారు. అంత అన్యోన్యంగా కనిపించే జంట విడిపోవడమేంటి అని బాధపడిపోయారు. ఆ తర్వాత కాసేపటికి వాళ్లు ఎందుకు విడిపోయారు అనేదానిపై చర్చ మొదలైంది. అన్ని చర్చలకూ సమంతే టార్గెట్ అయ్యింది.
సామ్, చైతులు విడిపోడానికి ముమ్మాటికీ సమంతే కారణమంటూ అభిమానులతో పాటు మీడియా కూడా తేల్చేయడాన్ని సామ్ భరించలేకపోయింది. సోషల్ మీడియాలో ఇవాళ స్ట్రాంగ్‌గా రియాక్టయ్యింది. ‘నామీద సానుభూతి చూపించినవారందరికీ చాలా థ్యాంక్స్. కానీ కొందరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. పుకార్లు పుట్టిస్తున్నారు. నేను అవకాశవాదినంట. పిల్లల్ని వద్దని అనుకున్నానట. అబార్షన్లు కూడా చేయించుకున్నానట. చివరికి నాకు అఫైర్స్ కూడా ఉన్నాయంటున్నారు. డివోర్స్ తీసుకోవడం ఎంతో బాధపెట్టే విషయం. నేనా బాధలో ఉన్నప్పుడు నాపై ఇలా దాడి చేయడం అన్యాయం. నేనెప్పుడూ అలా చేయను. మీరు నన్ను ఎంత బాధపెట్టినా నేను చెక్కు చెదరను. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి’ అంటూ బాధ, కోపం, వ్యంగ్యం కలగలిపి తన మనసులోని మాటల్ని బైటపెట్టింది సమంత.
ఆమె బాధలో న్యాయం లేకపోలేదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఇలా జరిగిందేమో అని అంచనాలు వేసేస్తూ ఎవరికి వారు ఓ కంక్లూజన్‌కి వచ్చేస్తున్నారు. చూసేవారికి, వినేవారికి నిజమనిపించేలా నిర్థారించి చెప్పేస్తున్నారు. భర్త నుంచి విడిపోయి ఒంటరిదైపోయిందని కామెంట్ చేసినవారే.. ఆమె నిజంగా ఒంటరిదాన్ని చేసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
సమంత కాస్త ఫాస్ట్‌గా ఉండటం వల్లో.. నాగచైతన్య కాస్త కూల్ గయ్ కావడం వల్లో.. అందరూ చైతుని చూసి అయ్యో పాపం అంటున్నారు అని ఇప్పటికే కొందరు మహిళా కార్యకర్తలు, సెలెబ్రిటీలు కామెంట్ చేశారు. సమంత టాప్‌లో ఉంది కదా, ఇండివిడ్యువాలిటీ ఎక్కువ కదా, అలా చేసే ఉంటుందేమో చాలామంది అనేసుకుంటున్నారు. అంతేకానీ ఇది పర్సనల్ విషయం కదా, భార్యాభర్తలు విడిపోతే ఇద్దరూ ఎంతో కొంత సఫరవుతారు కదా అనే యాంగిల్‌ని వాళ్లు పూర్తిగా మర్చిపోతున్నారు. బహుశా అందుకే సమంత ఈ పోస్ట్ పెట్టిందేమో!
This post was last modified on October 9, 2021 1:26 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…