Movie News

విడాకుల గాయానికి సమంత మందు

కొన్ని రోజుల్లో వివాహ నాలుగో వార్షికోత్సవం జరుపుకోబోతున్న సమయంలో తామిద్దరం విడిపోతున్నట్లుగా ప్రకటన చేసి తమ జంటను అభిమానించే అందరికీ తీవ్ర వేదక కలిగించారు అక్కినేని నాగచైతన్య, సమంత. ప్రేమలో ఉన్నపుడు, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక చూడముచ్చటగా అనిపించిన ఈ జంట విడిపోతుంటే.. తమకు తెలిసిన వాళ్లు ఇలా వేరు పడ్డట్లుగా చాలామంది చాలా మథన పడిపోయారు. ఈ జంట ఎందుకిలా చేసిందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తింది.

ఐతే ఎంతో ఆలోచించాకే చైతూ-సామ్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారనడంలో సందేహం లేదు. విడిపోవడానికి కారణాలేంటో, ఈ నిర్ణయం పర్యవసానాలేంటో వాళ్లిద్దరికే అందరి కంటే బాగా తెలుసు. కాబట్టి ఈ విషయంలో చర్చోపచర్చలు అనవసరం. ఐతే చాలామందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే.. చైతూనే సమంతను కాదనుకుని ఉంటాడు, విడాకుల నిర్ణయం పట్ల సమంతనే ఎక్కువ బాధపడుతోంది.. చైతూను వదులుకోవడం ఆమెకు ఇష్టం లేదు అని.

గత కొన్ని రోజుల్లో ఇరువురి ప్రవర్తన, వాళ్లు వ్యక్తపరిచిన భావాలను బట్టి జనాలకు ఇదే అభిప్రాయం కలుగుతోంది. సామ్ కచ్చితంగా బాధలో ఉందన్నది సన్నిహిత వర్గాల సమాచారం. ఐతే ఈ బాధ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడ్డానికి, జీవితంలో ముందుకు సాగడానికి ఆమె నిర్ణయించుకుందని.. ఇందుకు సినిమాల్లో బిజీ కావడమే సరైన మందు అని భావిస్తోందని అంటున్నారు. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సామ్.. తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార, విజయ్ సేతుపతి కలయికలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో నటిస్తూనే సామ్.. మూణ్నాలుగు చిత్రాలకు సంతకం చేసినట్లు వార్తలొస్తున్నాయి. అందులో ఒకటి శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో ఓ కొత్త దర్శకుడు రూపొందించే లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇవి కాక రెండు మూడు చిత్రాలు కూడా ఓకే అయ్యాయట. విడాకుల వార్త నుంచి అందరి దృష్టిని మళ్లించేలా త్వరలోనే వరుసగా ఈ సినిమాల ప్రకటనలు వచ్చేలా చూస్తోందట సామ్. వీలైనంతగా కెరీర్‌ను పొడిగించుకుని వ్యక్తిగత జీవితంలో లోటును పూడ్చుకోవాలని, విడాకుల బాధ నుంచి బయటపడాలని ఆమె చూస్తున్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on October 8, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

1 minute ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

14 minutes ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

1 hour ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

3 hours ago

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

3 hours ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

3 hours ago