కాజల్ తల్లి కాబోతోందట, కమిటైన సినిమాల నుంచి తప్పుకుందట అంటూ కొద్ది రోజులుగా వార్తల మీద వార్తలు వస్తున్నాయి. కానీ దాన్ని ఇంతవరకు ఎవరూ కన్‌ఫర్మ్ చేసింది లేదు. అయితే రీసెంట్‌గా ఆమె చేయాల్సిన సినిమా హన్సిక చేస్తున్నట్లు తెలియడంతో ఆ న్యూస్ నిజమై ఉండొచ్చనే అనిపిస్తోంది.
ప్రస్తుతం కాజల్ చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో ఆచార్య, హే సినామికా, ఉమ లాంటి కొన్ని చిత్రాలు కంప్లీట్ చేసేసింది. మిగతావన్నీ సెట్స్‌పై ఉన్నాయి. కాంట్రవర్శీలతో ఆగిన ‘ఇండియన్ 2’ కూడా త్వరలో రీస్టార్ట్ కానుందని కమల్ హాసన్ చెప్పారు. ఒకవేళ కాజల్ కన్సీవ్ అవ్వడం నిజమే అయితే వీటిని పూర్తి చేయడం ఇప్పట్లో జరిగే పని కాదు. ముఖ్యంగా నాగార్జునతో చేస్తున్న ‘ద ఘోస్ట్’ మూవీ చేయడం ఆమెకి మరీ కష్టం.
ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్. నాగ్‌తో పాటు కాజల్ కూడా చాలా పవర్‌ఫుల్ రోల్ చేస్తోంది. ఫైట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి తను తల్లి కాబోతుంటే ఈ రోల్ చేయడం కాస్త కష్టం, రిస్క్ కూడా. అందుకే కాజల్ ఆ సినిమా నుంచి తప్పుకుందంటూ వార్తలొచ్చాయి. మరోవైపు ఆమె చేయాల్సిన ‘రౌడీ బేబీ’ సినిమా రీసెంట్‌గా హన్సికతో మొదలైంది. కాజల్ తమ ‘రౌడీ బేబీ’ మూవీలో లీడ్ రోల్ చేస్తోందంటూ జులై నెలలో నిర్మాత పిళ్లై అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్‌గా జరిగిన ఓపెనింగ్ సమయంలో కాజల్ బదులు హన్సిక చేస్తున్నట్లు కన్‌ఫర్మ్ అయ్యింది.
ఇవన్నీ చూస్తుంటే ఇంతవరకు వచ్చిన వార్తలన్నీ నిజమేననిపిస్తోంది. తాజాగా కాజల్ చేసిన ఓ ప్రకటన దీనికి మరింత బలాన్నిస్తోంది. ‘ఓ కొత్త అనౌన్స్‌మెంట్ రాబోతోంది, కాస్త వేచి ఉండండి’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కాజల్. దాంతో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్‌ఫర్మ్ చేయబోతోందంటున్నారంతా. అది నిజమో లేక మరేదైనా కొత్త కబురు చెప్పబోతోందో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 8, 2021 9:43 am
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…