Movie News

జూనియర్ ఐశ్వర్య.. కమెడియన్‌తో!

ఐశ్వర్యారాయ్‌లా ఉందంటూ స్నేహా ఉల్లాల్‌కి తన పక్కన హీరోయిన్‌గా చోటిచ్చాడు సల్మాన్ ఖాన్. జూనియర్ ఐశ్వర్య అంటూ అప్పట్లో మీడియా కూడా ఆమెని ఆకాశానికి ఎత్తేసింది. అలా గ్రాండ్‌గా మొదలైన స్నేహ కెరీర్ కొన్నాళ్లు బానే సాగింది. ముఖ్యంగా తెలుగులో మంచి పేరొచ్చింది. ఉల్లాసంగా ఉత్సాహంగా, నేను మీకు తెలుసా, కరెంట్ లాంటి సినిమాల్లో నటించిందామె.
‘సింహా’లో బాలకృష్ణతో జోడీ కట్టింది. కన్నడ, బెంగాలీ భాషల్లోనూ నటించింది. కానీ సక్సెస్ రేట్ తగ్గడంతో కెరీర్ గ్రాఫ్ మెల్లగా పడిపోయింది. కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌ కూడా చేసేందుకు రెడీ అయిన స్నేహ.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.

అయితే తను కొన్నాళ్ల పాటు నటనకి దూరంగా ఉండటానికి అవకాశాలు తగ్గడమే కాదు, అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయంటూ ఆమధ్య కొన్ని వార్తలు వచ్చాయి. ఓ హెల్త్ ప్రాబ్లెమ్ స్నేహను బాగా ఇబ్బంది పెడుతోందని చాలామంది చెప్పారు కూడా. అయితే ఆ సమస్యలన్నింటినీ దాటుకుని వచ్చి రీ ఎంట్రీ ఇచ్చింది స్నేహ. పోయినేడు ‘ఎక్స్‌పైరీ డేట్’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఇప్పుడు తెలుగు సినిమాల వైపు అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం ‘ఎయిట్‌’ అనే మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది స్నేహ. ఇందులో సప్తగిరి హీరో. రిజ్వాన్ ఎంటర్‌‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందట. దాంతో ఈ సినిమా ద్వారా టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అయ్యింది స్నేహ. ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడంతో ఈ విషయం బైటికొచ్చింది. చెప్పాలంటే ఇప్పటికీ స్నేహ అలానే ఉంది. లుక్‌లో పెద్ద డిఫరెన్స్ లేదు. కాబట్టి అన్నీ కలిసొస్తే ఆమె మరోసారి బిజీ అయ్యే చాన్స్ లేకపోలేదు.

This post was last modified on October 7, 2021 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

1 hour ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago