‘మాస్టర్ చెఫ్’.. తమన్నా ప్లేస్ లో స్టార్ యాంకర్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన తమన్నా.. రీసెంట్ గానే బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. వెండితెరపై తన అందాలతో మెప్పించిన మిల్కీబ్యూటీ బుల్లితెరపై ‘మాస్టర్ చెఫ్’ టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరించింది. ఈ మధ్యనే ఈ షోని టెలికాస్ట్ చేస్తున్నారు.

హోస్ట్ గా తమన్నాకు మంచి పేరే వచ్చింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ ప్లేస్ లో స్టార్ యాంకర్ అనసూయను తీసుకోవాలని భావిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. రాబోయే ఎపిసోడ్స్ కి హోస్ట్ గా తమన్నా స్థానంలో అనసూయ కనిపిస్తుందట.

కొన్నిరోజుల్లో ఈ షో మొదటి సీజన్ పూర్తికానుంది. అయితే తమన్నా ఇచ్చిన డేట్స్ ని షో నిర్వాహకులు సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఆమెకి సినిమా కమిట్మెంట్స్ ఉండడంతో ‘మాస్టర్ చెఫ్’కి ఎక్కువ డేట్స్ ని కేటాయించలేకపోతుంది. దీంతో నిర్వాహకులు ఆమెకి బదులుగా అనసూయని రంగంలోకి దించారు. ఇప్పటికే బెంగుళూరులో నిర్వహించిన ఓ ఎపిసోడ్ షూటింగ్ లో అనసూయ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ సీజన్ లో ఉన్న మిగిలిన ఎపిసోడ్స్ కి అనసూయ యాంకరింగ్ చేయబోతుంది.

ఆ తరువాత సెమీ ఫైనల్స్, ఫైనల్ ఎపిసోడ్స్ లో మళ్లీ తమన్నా కనిపిస్తుందని అంటున్నారు. కొన్ని ఎపిసోడ్స్ అయినప్పటికీ అనసూయ మంచి ఛాన్స్ పట్టేసిందనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ హోస్ట్ చేసిన షోలో అనసూయను తీసుకున్నారంటే ఆమెకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. దీనికి గాను అనసూయకి మంచి రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తోంది. మరి ఈ షోతో అనసూయకి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి!