అల్లు అర్జున్-సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అందులో ఫస్ట్ పార్ట్ అయిన పుష్ప-ది రైజ్‌ను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. క్రిస్మస్‌కు వారం ముందే, అంటే డిసెంబరు 17న పుష్ప-1 వస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కానీ దీని గురించి హీరో అల్లు అర్జున్ మాత్రం ట్వీట్ వేయలేదు.
మామూలుగా తన సినిమాలకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా బన్నీ ట్వీట్ రూపంలో అభిమానులతో పంచుకుంటాడు. కానీ పుష్ప రిలీజ్ డేట్ గురించి మాత్రం అతను ట్వీట్ వేయలేదు. ఇది యధాలాపంగా విస్మరించిన విషయం కాదని.. విడుదల తేదీ విషయంలో బన్నీ డోలాయమానంలో ఉన్నాడే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డేట్ ఫైనల్ కాదేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ఇందుకు కారణం లేకపోలేదు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్యను కూడా క్రిస్మస్ బరిలో దించాలని చూస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే డిసెంబరు 17కే ఈ సినిమాను ఖరారు చేసినట్లుగా కూడా సోషల్ మీడియాలో వార్తలొస్తుండటం విశేషం.
దసరాకు కానీ.. దీపావళికి కానీ ఆచార్యను రెడీ చేయలేకపోగా.. సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు బుక్ అయిపోయాయి. వేసవి వరకు సినిమాను ఆపే పరిస్థితి లేదు. దీంతో క్రిస్మస్ టైంలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నట్లుగా చిత్ర బృందం నుంచి సమాచారం బయటికొస్తోంది. కానీ పుష్ప కూడా అదే సీజన్‌కు రెడీ అవుతుండటంతో రిలీజ్ డేట్ విషయంలో ఏం చేద్దామనే సందిగ్ధత నెలకొంది. మరి ఈ రెండు చిత్రాల మేకర్స్ మధ్య రిలీజ్ డేట్ విషయంలో ఏం సర్దుబాటు జరుగుతుందో.. ఏది ఏ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
This post was last modified on October 5, 2021 12:42 pm
భారత దేశానికి శత్రుదేశాలపై యుద్ధాలు కొత్తకాదు.. ఉగ్రవాదులపై దాడులు కూడా కొత్తకాదు. కానీ.. అందరినీ ఏకం చేయడంలోనూ.. అందరినీ ఒకే…
అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే అల్లు అర్జున్ 22 షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ లాక్ చేసిన టీమ్ ప్రస్తుతం…
ఇన్నేళ్లు సమంతను ఒక కథానాయికగానే చూశాం. కానీ ఇప్పుడు ఆమెను నిర్మాతగా చూస్తున్నాం. తన ప్రొడక్షన్లో తెరకెక్కిన తొలి చిత్రం…
ఓర్పు-సహనం.. అనేవి ఎంతో కష్టం. ఒక విషయం నుంచి.. ప్రజల ద్వారా మెప్పు పొందాలన్నా.. అదేసమయంలో వస్తున్న విమర్శల నుంచి…
సుమారు 1000 కోట్ల రూపాయల వరకు ప్రకృతి సంపదను దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న ఓబులాపురం మైనింగ్ కేసులో ప్రధాన దోషులు..…
దాయాది దేశం పాకిస్థాన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్…