టాలీవుడ్ లో జరగనున్న ‘మా’ ఎన్నికలు బై ఎలెక్షన్స్ ను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న జరగనున్న ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్.. నరేష్, మంచు విష్ణులను విమర్శిస్తూ ఘాటు కామెంట్స్ చేశారు. తాజాగా మంచు విష్ణు ఆ విమర్శలకు ధీటుగా బదులిచ్చారు. ‘అపరిచితుడు’ సినిమాలో విక్రమ్ మాదిరి ప్రకాష్ రాజ్ ఎప్పటికప్పుడు మాటలు మార్చేస్తున్నారని.. ఆయనకు కన్సిస్టెన్సీ అనేది లేదని అన్నారు.
ఇండస్ట్రీకి అవార్డులను తీసుకొచ్చింది నేనే అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా.. అవార్డులు ఆయన తీసుకొచ్చాడా..? అని ప్రశ్నించారు మంచు విష్ణు. రామారావు గారు కన్నా, నాగేశ్వరావు గారు కన్నా.. మా నాన్నగారి కన్నా.. చిరంజీవి గారి కన్నా.. గొప్ప నటుడా ఆయన..? అని విమర్శించారు. ఇండస్ట్రీ ఆయన్ను పోషించిందని.. అవకాశం ఇచ్చిందని అన్నారు మంచు విష్ణు. ఇండస్ట్రీలో ఎప్పుడూ ‘మా’ ఎలెక్షన్స్ ఇంత అగ్రెసివ్ గా జరగలేదని.. ఈసారి అలా జరుగుతుండడానికి ప్రకాష్ రాజే కారణమని అన్నారు.
ఇండస్ట్రీలో ఏ నిర్మాతను, దర్శకుడ్ని అడిగినా.. ప్రకాష్ రాజ్ గురించి చెబుతారని.. సెట్ లో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ని బూతులు తిట్టారని.. దీంతో ఆయన్ను సినిమా నుంచి తీసేసి సోనూసూద్ ని పెట్టుకున్నారని.. ఆయనకు అంత పొగరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్ తనపై చేసే విమర్శలు చూస్తుంటే నవ్వొస్తుందని వెటకారంగా అన్నారు. ఆయనకు చిన్నా, పెద్దా అనే గౌరవడం లేదని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates