‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఆషామాషీ సినిమాలు చేసే పరిస్థితి లేదు. ఎంతో భారీతనం ఉండే కథలు.. వందల కోట్ల బడ్జెట్లు.. వేర్వేరు భాషలకు చెందిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్.. అతడి సినిమాల లెక్కే మారిపోయింది. ఇంతింత భారీ ప్రాజెక్టులు చేస్తున్నప్పటికీ ప్రభాస్ ఏమీ నెమ్మదిగా అడుగులు వేయట్లేదు. ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. సమాంతరంగా రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు.
‘రాధేశ్యామ్’ పూర్తి కాకముందే మూడు భారీ పాన్ ఇండియా సినిమాలను ప్రభాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మూడూ ఆల్రెడీ సెట్స్ మీదికి కూడా వెళ్లిపోయాయి. ‘సలార్’ షూటింగ్ మధ్య దశలో ఉంటే.. ‘ఆదిపురుష్’ కూడా జోరుగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ ఆరంభం దశలో ఉంది. ఇవి మూడూ పూర్తి కావడానికి ఏడాదిన్నర, రెండేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నారు.
ఇంతలోనే ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రకటించబోతున్నాడన్నది తాజా హాట్ న్యూస్. ఇందుకు ముహూర్తం కూడా కుదిరిందట. అక్టోబరు 7న ప్రభాస్ 25వ సినిమాను ప్రకటించబోతున్నారట. ఈ మేరకు మీడియాకు సమాచారం అందింది. ప్రముఖ పీఆర్వోలందరూ వరుసగా దీని గురించి ట్వీట్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ చేస్తున్నది ప్రభాస్ 24వ చిత్రం కాగా.. అతడి కెరీర్లో ల్యాండ్ మార్క్ ఫిలిం అయిన 25వ చిత్రాన్ని ఇప్పుడు ప్రకటించబోతున్నారు. మరి ఈ చిత్రం ఏ దర్శకుడితో, ఏ నిర్మాతలతో అన్నది సస్పెన్స్‌గా మారింది.
ప్రభాస్ తర్వాతి చిత్రాల గురించి జరిగిన ప్రచారం ప్రకారం ‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తోనే మరో కమిట్మెంట్ ఉంది. దిల్ రాజు ప్రొడక్షన్లో ఆ సినిమా చేయాల్సి ఉంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తోనూ ప్రభాస్‌కు ఒక కమిట్మెంట్ ఉంది. కరణ్ జోహార్ సైతం ప్రభాస్‌తో సినిమా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరిలో ఏ దర్శకుడు, ఏ నిర్మాతతో ప్రభాస్ 25వ సినిమా చేస్తాడన్నది ఆసక్తికరం. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళితో ప్రభాస్ జట్టు కట్టబోతున్నాడని.. ల్యాండ్ మార్క్ ఫిలింను ఆయనతో చేయబోతున్నాడని కూడా ఓ ప్రచారం నడుస్తుండటం విశేషం. మరి ఏడో తారీఖు అనౌన్స్‌మెంట్ ఎలా ఉండబోతోందో చూడాలి.
This post was last modified on October 4, 2021 6:18 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…