నవరస.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంతటా రెండు నెలల కిందట చర్చనీయాంశంగా మారిన ఆంథాలజీ ఫిలిం. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన చిత్రమిది. దర్శకుడు, యాడ్ ఫిలిం మేకర్ జయేంద్ర కూడా ఇందులో భాగస్వామి. ఇందులో తొమ్మిది కథలుంటే.. వాటిని ప్రియదర్శన్, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖ దర్శకులు సహా తొమ్మిది మంది రూపొందించడం విశేషం. సూర్య, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి లాంటి మేటి నటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 6న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఐతే ఇంతమంది లెజెండ్స్, ప్రముఖులు కలిసి చేసిన ఆంథాలజీ ఫిలిం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. అయినప్పటికీ ఇంతమంది పేరున్న ఫిలిం మేకర్స్, ఆర్టిస్టులు కలిసి చేసిన ఫిలిం కాబట్టి దీన్ని జనం బాగానే చూశారు. నెట్ ఫ్లిక్స్ నుంచి దీని మేకర్స్ ఆదాయం బాగానే వచ్చింది.
ఐతే ఇదేమీ సొంతంగా లాభాలు చేసుకోవడానికి చేసిన సినిమా కాదు. కరోనా కాలంలో అవస్థలు పడ్డ సినీ కార్మికులను ఆదుకోవడం కోసమే తమిళ సినీ పరిశ్రమలోని ప్రముఖులంతా కలిసి ఉచితంగా ఈ ఫిలిం చేశారు. ఎవ్వరూ పారితోషకాలు తీసుకోలేదు. దీని ద్వారా ఎంత ఆదాయం వచ్చిందన్నది వెల్లడి కాలేదు కానీ.. ఈ డబ్బులతో సినీ కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన వారు కలిపి మొత్తం 12 వేల మందికి సాయం చేశారట. ఇంతమంది కడుపులు నింపిన సిరీస్ అంటూ దీనిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.
కరోనా టైంలో వివిధ సినీ పరిశ్రమలు అందులోని కార్మికులను ఆదుకోవడానికి వివిధ రకాల సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. అన్ని ఇండస్ట్రీల్లోకి టాలీవుడ్ గొప్పగా స్సందించింది. చిరంజీవి సహా ప్రముఖులందరూ పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. బయట కూడా నిధులు సేకరించి కార్మికుల కడుపు నింపారు. తమిళ సినీ పరిశ్రమ నుంచి ఆ స్థాయిలో విరాళాలు రాలేదు కానీ.. వాళ్లు కూడా ఉన్నంతలో సేవా కార్యక్రమాలు బాగానే చేశారు. వాటికి తోడు ‘నవరస’ ఫిలిం ద్వారా కార్మికులకు సాయం అందింది.
This post was last modified on October 4, 2021 10:44 am
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…