తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ మొదలై కొన్ని వారాలు గడిచింది. షో ఆసక్తికరంగానే సాగుతున్నట్లుగా ఫీడ్ బ్యాక్ వస్తోంది. తెలుగుతో పాటే ఒకే ఏడాది మొదలైన తమిళ బిగ్ బాస్.. ప్రతి సీజన్లోనూ కొన్ని వారాలు ఆలస్యంగా మొదలవుతోంది. ఈసారి కూడా తెలుగు షో మొదలైన నెల రోజులకు తమిళ బిగ్ బాస్ శ్రీకారం చుట్టుకుంది. ఆదివారం కర్టెన్ రైజర్ ప్రసారమైంది. తెలుగులో మాదిరే తమిళంలోనూ ఈసారి జంబో జట్టునే హౌస్‌లోకి దించారు. మొత్తం 18 మంది పార్టిసిపెంట్లకు ఈసారి అవకాశం దక్కింది. అందులో ఒక తెలుగమ్మాయి కూడా ఉండటం విశేషం. ఆ అమ్మాయే.. పావని రెడ్డి.
ఈ పేరు చూస్తేనే తను తెలుగమ్మాయి అనే విషయం అర్థమైపోతుంది. తెలుగులో సీరియల్స్, సినిమాల్లో పావని నటించింది. కాకపోతే అవి మరీ పేరున్నవి కావు. తెలుగులో ఆమె ది ఎండ్, డబుల్ ట్రబుల్, లజ్జ, డ్రీమ్ అనే చిన్న సినిమాల్లో నటించింది. అలాగే అగ్నిపూలు, నా పేరు మీనాక్షి, నేను ఆయన ఆరుగురు అత్తలు అనే సీరియళ్లు కూడా చేసింది.
ఐతే ఇక్కడ అంతగా పాపులర్ కాకపోవడంతో తమిళంలోకి వెళ్లిపోయిన పావని.. చెప్పుకోదగ్గ అవకాశాలే వచ్చాయి. టీవీ సీరియళ్లు, షోలతో పాటు సినిమాల్లోనూ చెప్పుకోదగ్గ పాత్రలు చేసింది.
పావని పేరు నాలుగేళ్ల కిందట మీడియాలో బాగా నానింది. ఆమె భర్త అయిన తెలుగు టీవీ నటుడు ప్రదీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాతే ఆమె తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయి చెన్నైలోనే సెటిలైపోయింది. తమిళం నేర్చుకుని తమిళ సీరియళ్లు, సినిమాలతో కొంచెం బిజీ అయిన పావనికి అక్కడ మంచి పాపులారిటీనే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్‌లో అడుగు పెడుతున్న పావని.. హౌస్‌లో ఎలాంటి పేరు సంపాదించి, తమిళ ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on October 4, 2021 10:32 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…