వేణు స్వామి.. తెలుగు జనాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకం గురించి అంచనాలు కడుతూ సోషల్ మీడియాలో బాగానే పాపులారిటీ సంపాదించారాయన. ఆయన అంచనాలు కొన్ని నిజమయ్యాయి. కొన్ని బోల్తా కొట్టాయి. ఐతే సంచలన విషయాల మీద చాలా కాన్ఫిడెంట్‌గా జ్యోతిషం చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారాయన. అక్కినేని కుటుంబంలో రెండు పెళ్ళిళ్ళ గురించి ఆయన వేసిన అంచనాలు నిజం కావడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో శ్రియ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం చేసుకోవడం తెలిసిందే. ఐతే ఎంగేజ్మెంట్ తర్వాత వీళ్లిద్దరూ విడిపోవడం సంచలనం రేపింది. దీని గురించి వేణు స్వామి ముందే అంచనా వేశారు. జాతకాల ప్రకారం వాళ్లిద్దరూ విడిపోతారని చెప్పారు. ఇక నాగచైతన్య-సమంతల విషయంలోనూ వేణు స్వామి ఇలాగే అంచనా వేయడం విశేషం.
గతంలో ఫేస్ బుక్ వేదికగా నాగచైతన్య, సమంత జంట గురించి ఒక పోస్టు పెట్టారు వేణు స్వామి. చైతూది ఆశ్లేష నక్షత్రమని, సమంతది భరణి నక్షత్రమని.. వీళ్లిద్దరికి సరిపడదని.. అందుకే పెళ్లి ఒకసారి పోస్ట్ పోన్ అయిందని.. పెళ్లి తర్వాత కూడా కుజ దోషం, కాలసర్ప దోషం వల్ల విడాకులు తప్పవని, లేదంటే సంతాన లేకపోవడం జరుగుతుందని ఆయనొక పోస్ట్ పెట్టారు. ఇప్పుడా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాక ‘లవ్ స్టోరి’ విడుదలకు కొన్ని రోజుల ముందు వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో చైతూ-సామ్ జంట గురించి మాట్లాడారు.
వీళ్లిద్దరూ విడిపోయే అవకాశం ఉందని.. ఒకవేళ అదే జరిగితే నాగచైతన్య కెరీర్లో తిరుగులేని స్థాయికి వెళ్తాడని.. సమంత కంటే 100 రెట్లు ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తాడని.. అదే సమయంలో సమంత బాగా డౌన్ అయిపోతుందని.. చైతూ ఎదుగుదలకు ‘లవ్ స్టోరి’ ప్రారంభంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వీడియో కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆయన్ని సరదాగానే విజనరీగా అభివర్ణించేస్తున్నారు నెటిజన్లుజ వేణు స్వామి గతంలో వేసిన అంచనాల్లో కొన్ని ఇలాగే నిజమైనప్పటికీ.. చాలా వరకు తలకిందులయ్యాయి. అఖిల్-శ్రియ, చైతూ-సామ్‌ల విషయంలో ఆయన వైల్డ్ గెస్‌లు నిజమైనంత మాత్రాన వేణు స్వామిని పొగిడేయాల్సిన అవసరం లేదని ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు.
This post was last modified on October 3, 2021 3:07 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…