Movie News

చై-సామ్ విడాకులు.. ఏమిటీ పిచ్చి మాటలు?


కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ అక్కినేని నాగచైతన్య-సమంత తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘ చర్చల తర్వాతే తాము విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది. ఎంతో ఆలోచించాకే వాళ్లీ నిర్ణయం తీసుకున్నారన్నది స్పష్టం. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోవడం కష్టమవుతున్నప్పటికీ.. దీని వల్ల అందరికంటే ఎక్కువగా ప్రభావితం అయ్యేది వాళ్లిద్దరే కాబట్టి.. వారి నిర్ణయాన్ని తప్పుబట్టలేం.

ఈ సంగతలా వదిలేస్తే ఇప్పుడందరి దృష్టీ వీరిలా విడిపోవడానికి దారి తీసిన కారణాలేంటన్న దానిపై పడింది. ఈ విషయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కారణాలు సృష్టించేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేసేస్తున్నారు. చైతూ-సామ్ విడిపోవడానికి ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌ కారణమని బలంగా నమ్ముతున్న వాళ్లు చాలామందే కనిపిస్తుండటం గమనార్హం.

‘ఫ్యామిలీ మ్యాన్-2’లో సమంత ఎంత బోల్డ్‌గా నటించిందో తెలిసిందే. అందులోని కొన్ని సన్నివేశాలు అక్కినేని అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. ఈ విషయంలో చైతూను సోషల్ మీడియా వేదికగా చాలామంది ప్రశ్నించారు. సమంతను తిట్టిపోశారు కూడా. ఆ సిరీస్‌లో అలా నటించినందుకే చైతూ హర్టయ్యాడని, దీనిపై గొడవ జరిగి ఇద్దరూ విడిపోయే వరకు వచ్చిందని తీర్మానాలు చేసేస్తున్నారు. వీరి విడాకులకు ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కారణమంటూ పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి.

ఐతే తరాల నుంచి సినిమాల్లో ఉన్న అక్కినేని కుటుంబంలోని వాళ్లు.. పెళ్లి తర్వాత నటన మానేయాలని కానీ, ఫలానా తరహా పాత్రల్లోనే కనిపించాలని సమంతకు షరతులు పెట్టి ఉంటారని ఎలా అనుకుంటాం? పెళ్లి తర్వాత సమంత కొన్ని సినిమాల్లో సెక్సీగా కనిపించింది, హాట్ హాట్ ఫొటో షూట్లు చేసింది. సమంత హాట్‌గా కనిపించిన వెకేషన్ ఫొటోల్లో చైతూ కూడా ఉండటం గమనించవచ్చు.

అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు వచ్చి ఉంటుందా? తన తప్పులు సహా అన్నీ తెలిశాకే చైతూ తనను పెళ్లి చేసుకున్నాడని.. తనకు అతను ఎలాంటి షరతులూ పెట్టడని సమంత గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి సినిమాలో, వెబ్ సిరీస్‌లో, హాట్ ఫొటో షూట్లో వీరి విడాకులకు దారి తీశాయని అనుకోవడం మూర్ఖత్వం. అలాగే బిడ్డను కనడానికి సమంత ఒప్పుకోలేదని.. తన భార్య నుంచి విడాకులు తీసుకున్న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ టైంలో చైతూను ప్రభావితం చేసి సమంత నుంచి విడిపోయేలా చేశాడని.. ఇలాంటి పిచ్చి కారణాలు వెతకడం కూడా మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. దీనికి దారి తీసిన కారణం పూర్తిగా వ్యక్తిగత విషయం అయ్యుంటుంది. ఆ కారణం ఏంటన్నది ఎప్పటికీ బయటికి రాకపోవచ్చు కూడా.

This post was last modified on October 3, 2021 2:42 pm

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

9 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago